Katrina Kaif: మన దేశంలో కుర్రకారు గుండెల్ని పిండేసే అందం ఆమె సొంతం. సినిమాల్లో ఆమె కనిపిస్తే చాలు అనిపించే ఆ భామ తన అందచందాలతో మత్తెక్కిస్తోంది. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. దీంతో బాలీవుడ్ లోనే అందమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. ఆమె ఎవరో కాదు కత్రినా కైఫ్. ఆమె తెలుగులో కూడా వెంకటేశ్ తో మల్లీశ్వరి లో నటించి ప్రత్యేక గుర్తింపు సాధించింది. తరువాత బాలకృష్ణతో అల్లరి పిడుగులో నటించినా అది విజయవంతం కాలేదు. దీంతో ఆమె తెలుగుకు దూరమైనట్లు తెలుస్తోంది.

కత్రినాకైఫ్ బాలీవుడ్ కథానాయకుడు విక్కీ కౌశల్ ను ప్రేమించి గత ఏడాది వివాహం చేసుకుంది. ఇటీవల ఆమె గర్భం దాల్చినట్లు వార్తలు వస్తున్నాయి. విక్కీతో కత్రినా కైఫ్ ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. ఆమె నటించిన సూర్యవంశీ విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎయిర్ పోర్టులో కనిపించగా ఆమె గర్భవతి అని తెలిసిపోతోందని చెబుతున్నారు.
2021లో వీరిద్దరు ఒక్కటయ్యారు. డిసెంబర్ 9న రాజస్తాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని డిస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందీ జంట. ప్రస్తుతం కత్రినా కైఫ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె గర్భవతి అని నిర్ధారించుకుంటున్నారు. రెండు సంవత్సరాలు డేటింగ్ చేసిన అనంతరం వీరు వివాహం చేసుకున్నారు. ఇటీవల హనీమూన్ వెళ్లినట్లు తెలుస్తోంది.

38 ఏళ్ల కత్రినా కైఫ్ తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన విక్కీని పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టించింది. ప్రేమకు అవన్నీ అడ్డు రావు. నచ్చితే చాలు చేసుకోవడానికే ఇష్టడుతుంటారు. ఇదే కోవలో కైఫ్, విక్కీల పెళ్లి కూడా జరిగినట్లు చెబుతున్నారు. దీంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. తమ ఇష్టమైన నటి తల్లి కాబోందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. భవిష్యత్ లో మంచి బిడ్డను కని సినిమా రంగానికి అందివ్వాలని ఆశిస్తున్నారు.