Varun Tej Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించిన గని మూవీ ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందిన సంగతి మన అందరికి తెలిసిందే..గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా పై మొదటి నుండి అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి, ఎందుకంటే గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి వచ్చే మూవీ మినిమం గ్యారంటీ సినిమా అవుతుంది అని ట్రేడ్ వర్గాల్లో ఒక్క బలమైన అభిప్రాయం ఉంది..గని మూవీ కి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ని చూసి ఈ సినిమా కచ్చితంగా వరుణ్ తేజ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు..కానీ విడుదల రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేసింది..ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వారం కూడా గడవకముందే క్లోసింగ్ కి పడిపొయ్యే పరిస్థితి ఏర్పడింది..ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద ఈ సినిమా క్లోసింగ్ కలెక్షన్స్ 3 కోట్ల 75 లక్షల రూపాయిలు మాత్రమే అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ సినిమాని బయ్యర్లు అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపు 25 కోట్ల రూపాయలకు బిజినెస్ చేసారు..కానీ క్లోసింగ్ కలెక్షన్లు నాలుగు కోట్ల రూపాయిలు కూడా రాకుండా 20 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు రావడం తో వరుణ్ చాలా బాధ పడ్డాడు అట.

అభిమానులు మరియు ఈ సినిమా ని కొన్న బయ్యర్లను ఉద్దేశిస్తూ వరుణ్ తేజ్ ట్విట్టర్ లో పెట్టిన ఒక్క బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, ఈ లేఖ లో ఆయన ఏమి రాసాడు అంటే ‘నా మీద మీరందరు చూపించే ప్రేమ మరియు అభిమానం కి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను..గని సినిమా కి పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరు పేరున ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను, ఈ సినిమా ని నిర్మించడం కోసం వీళ్లిందరు ఎంత కస్టపడి పని చేసారో నాకు బాగా తెలుసు..ఒక్క మంచి సినిమాని మీకు అందించడానికి మేము అందరం ఎంతో కష్టపడ్డాం..కానీ దురదృష్టం కొద్దీ ఈ సినిమా మీ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది, అందుకు నేను మీ అందరి నుండి క్షమాపణలు కోరుతున్నాను..ప్రతి సినిమాకి నేను నా బెస్ట్ ఇవ్వడానికి ఎంతో ట్రై చేస్తాను..అలాగే గని సినిమా కోసం కూడా నేను ఎంతో మనసుపెట్టి చేశాను..కానీ అది మీ అంచనాలను మ్ముకోలేకపోయింది..ఇక నుండి స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో మరింత జాగ్రత్తలు తీసుకొని మిమల్ని అలరించడానికి నా వంతు కృషి చేస్తాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

Also Read: తెలంగాణలో కేజీఎఫ్-2 టిక్కెట్ల రేట్లు పెంపు.. డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట..
వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తో కలిసి F 3 అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం ఇటీవలే పూర్తి చేసుకొని మే నెలలో విడుదల అవ్వడానికి సిద్ధం గా ఉంది..2018 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా F 2 సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ..వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ సినిమా ఒక్క బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పోయింది, అలాంటి సినిమాకి సీక్వెల్ గా వస్తున్నా సినిమా కావడం తో F 3 పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి..అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కూడా అద్భుతంగా వచ్చింది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే , వరుస హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న వరుణ్ తేజ్ కెరీర్ కి ఒక్క స్పీడ్ బ్రేకర్ లా నిలిచింది గని సినిమా, మరి ఈ చేదు అనుభవం నుండి ఆయన F 3 సినిమా తో మరోసారి తన సత్తా చాటుకుంటాడా లేదా అనేది చూడాలి.
Also Read: ఆ దర్శకుడిపై ప్రతీకారం తీర్చుకుంటున్న ‘చిన్న’ ఎన్టీఆర్ ఫ్యాన్స్..!
