https://oktelugu.com/

Katrina Kaif Marriage: కత్రినా-విక్కీల హనీమూన్​ భారీగానే ప్లాన్ చేశారుగా?.

Katrina Kaif Marriage: బాలీవుడ్​లో గత రెండువారాలుగా హాట్​టాపిక్​గా మారిన విషయం కత్రినా కైఫ్​, విక్కీ కౌశల్​ వివాహం గురించే. బాలీవుడ్​ క్యూట్​ లవ్​ కపుల్​గా ఉన్న వీరిద్దరు ఇటీవలే పెళ్లిపీటలెక్కి.. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అప్పటి వరకు వీరి పెళ్లి జరుగుతుందా జరగదా అన్న అంశంపై సోషల్​మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతుండగా.. పెళ్లికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో అభిమానులకు పోస్ట్​ చేసి ప్రపంచానికి తెలియజేశారు. ఈ వివాహం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 09:58 AM IST
    Follow us on

    Katrina Kaif Marriage: బాలీవుడ్​లో గత రెండువారాలుగా హాట్​టాపిక్​గా మారిన విషయం కత్రినా కైఫ్​, విక్కీ కౌశల్​ వివాహం గురించే. బాలీవుడ్​ క్యూట్​ లవ్​ కపుల్​గా ఉన్న వీరిద్దరు ఇటీవలే పెళ్లిపీటలెక్కి.. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అప్పటి వరకు వీరి పెళ్లి జరుగుతుందా జరగదా అన్న అంశంపై సోషల్​మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతుండగా.. పెళ్లికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో అభిమానులకు పోస్ట్​ చేసి ప్రపంచానికి తెలియజేశారు. ఈ వివాహం వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హజరయ్యారు.

    అయితే పెళలి తర్వాత కత్రినా కైఫ్​, విక్కీల వివాహానికి చేసిన ఖర్చుతోపాటు, వారి హనీమూన్​ గురించి సోషల్​మీడియాలో అనేక కథనాలు చక్కర్లు కొడుతునే ఉన్నాయి. తాజాగా సమాచారం ప్రకారం. వీరిద్దరు హనీమూన్​ కోసం యూరప్​కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐరోపాలో కేవళం ఒకటో రెండో కాదట. మొత్తం యూరప్​నే చుట్టి రానున్నట్లు సమాచారం. అందులో వీరి హనీమూన్​ కనీసం రెండు నెలలు కొనసాగుతుందని అంటున్నారు. ఈ హనీమూన్​ ప్లాన్​ మొత్తం విక్కీనేదట. పెళ్లి పూర్తిగా కత్రినా ఇష్టప్రకారమే జరగడం వల్ల హనీమూన్​ ట్రిప్​ మాత్రం విక్కీకి నచ్చినట్లుగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

    మరోవైపు కత్రినా నిశ్చితార్థం రోజు ధరించిన ఉంగరంపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. నీలమనితో రూపొందించిన ఆ రింగ్​ లక్షల్లో ఖరీదు చేస్తుందని అంటున్నారు. దీంతో పాటు మంగళసూత్రం కూాడా లక్షల్లోనే ఉంటుందని అంచనా. ఇలా వారు పెళ్లికి వేసుకున్న డ్రస్​, నగలు అన్నింటిపైనా నెటిజన్లు తమ అంచనాలకు తగ్గట్లు మాట్లాడుకుంటున్నారు.