కార్తీక్, దీపల కోసం వెతుకుతున్న కుటుంబం.. వంటల పనిలో చేరిన వంటలక్క!

బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కార్తీక్ వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో సౌందర్య, ఆనందరావు, ఆదిత్య కార్తీక్ గురించి జాడ దొరకటం లేదని బాధ పడతారు. సౌందర్య మాత్రం కార్తీక్ ఇంటికి రావాలి అని బాగా ఏడుస్తుంది. సౌందర్య.. బస్తీలో దీప గురించి ఏదైనా సమాచారం దొరుకుతుందనుకొని అక్కడికి వెళుతుంది. వారణాసి వాళ్లను దీప గురించి అడుగుతూ బతిమాలుతుంది. ఎక్కడున్నా చెప్పండి అంటూ వాళ్లు లేకుంటే ఉండలేము అని బాగా ఎమోషనల్ అవుతుంది. […]

Written By: Navya, Updated On : December 11, 2021 9:58 am
Follow us on

బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కార్తీక్ వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో సౌందర్య, ఆనందరావు, ఆదిత్య కార్తీక్ గురించి జాడ దొరకటం లేదని బాధ పడతారు. సౌందర్య మాత్రం కార్తీక్ ఇంటికి రావాలి అని బాగా ఏడుస్తుంది. సౌందర్య.. బస్తీలో దీప గురించి ఏదైనా సమాచారం దొరుకుతుందనుకొని అక్కడికి వెళుతుంది. వారణాసి వాళ్లను దీప గురించి అడుగుతూ బతిమాలుతుంది. ఎక్కడున్నా చెప్పండి అంటూ వాళ్లు లేకుంటే ఉండలేము అని బాగా ఎమోషనల్ అవుతుంది.

దీప తను ఉంటున్న ఊరిలో గ్రామ దేవత దగ్గరికి వెళ్లి తను పడిన బాధల గురించి ఎదుర్కొన్న ధైర్యాన్ని గురించి చెప్పుకుంటూ దండం పెట్టుకుంటుంది. పిల్లలు, డాక్టర్ బాబు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. వచ్చే కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని కోరుకుంటుంది. ఇక చీకటి పడటంతో దీప పడుకోడానికి ఆ ఇంట్లో పరుస్తుంది. పిల్లలని పడుకోమని చెబుతుంది. కార్తీక్ ను పిలుస్తుంది.

కార్తీక్ పిల్లల దగ్గరికి వెళ్లి ఇలాంటి పరిస్థితి తీసుకు వచ్చినందుకు సారీ అని చెబుతాడు. పిల్లలు కూడా ఏం కాదు నాన్న అంటూ సపోర్ట్ చేస్తారు. అప్పుడే బయట ఒక ఆవిడ పురిటి నొప్పులతో అరవడంతో దీప అక్కడికి వెళ్దాం అంటుంది. కార్తీక్ రాను అనేసరికి పిల్లలు వెళ్లి చూస్తారు. దీప కూడా కార్తీక్ ను తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్ లేరని వాళ్ళు బాధ పడటం తో పిల్లలు మా డాడీ డాక్టర్ అని అనడంతో కార్తీక్ వద్దు అని అంటాడు.

దీప కార్తీక్ దగ్గరకు వెళ్లి ట్రీట్మెంట్ చేయమని బతిమాలుతోంది. కార్తీక్ చేయనని నిరాకరిస్తూ అంబులెన్స్ కు ఫోన్ చేస్తాడు. ఇక ఆవిడను హాస్పిటల్ కి తీసుకు వెళ్తారు. కార్తీక్ తనను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించారని దీపతో చెబుతాడు. తరువాయి భాగంలో దీప వంటలు చేయడానికి పనిలోకి దిగుతుంది. కార్తీక్ కూడా మరో ఉద్యోగం వెతికినట్లు అనిపిస్తుంది. పిల్లలకు తాను డాక్టర్ అన్న విషయం ఎవరికీ చెప్పొద్దని అంటాడు.