The Family Man Season 3: తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ తివారి ప్రధాన పాత్ర చేశారు. 2019లో అమెజాన్ ఒరిజినల్ గా అందుబాటులోకి వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ఎంతగానో ఆకట్టుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసే అండర్ కవర్ ఏజెంట్ రోల్ చేశాడు మనోజ్ తివారి. ఇక ప్రియమణి ఆయన భార్యగా నటించారు. సీజన్ వన్ సక్సెస్ కావడంతో 2021లో సీజన్ 2 విడుదల చేశారు. కాగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత మరో ప్రధాన పాత్ర చేయడం విశేషం.
ది ఫ్యామిలీ మ్యాన్ 2కి సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె శ్రీలంకకు చెందిన తమిళ్ రెబల్ రోల్ లో అలరించింది. సీజన్ 2 కి సైతం మంచి రెస్పాన్స్ దక్కింది. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో ఒకింత బోల్డ్ రోల్ చేసింది. మనోజ్ తివారి, సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం బాగా కష్టపడ్డారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదలై మూడేళ్లు దాటిపోయింది. సీజన్ 3 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 3 విడుదలపై సమాచారం అందుతుంది.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 చిత్రీకరణ పూర్తి అయ్యిందట. పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టారట. రాజ్ అండ్ డీకే మరోసారి కలిసి ఈ సిరీస్ కోసం పని చేశారట. ఇండియన్ పై పాకిస్తాన్ టెర్రరిస్టుల కుట్రలు, తమిళ్ రెబల్స్ వంటి అంశాల ఆధారంగా మొదటి రెండు సీజన్స్ రూపొందించారు. ఇక సీజన్ 3లో కరోనా వైరస్, చైనా-ఇండియా కోల్డ్ వార్ వంటి అంశాల ప్రధానంగా తెరకెక్కించారని సమాచారం. కాబట్టి 2025 ప్రథమార్థంలో ది ఫ్యామిలీ మ్యాన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
సీజన్ 3లో కూడా మనోజ్ తివారి నటిస్తున్నారు. అయితే సమంత భాగమైనట్లు ఎలాంటి సమాచారం లేదు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో సమంత నటించే అవకాశం లేదు. మయోసైటిస్ తో బాధపడిన సమంత సిటాడెల్ సిరీస్ ని అతికష్టం మీద పూర్తి చేసింది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీలో సమంత, వరుణ్ ధావన్ నటించారు.