Shehzada: ‘అల వైకుంఠపురంలో’… అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్.. పైగా నెంబర్ వన్ రేసులో నేను కూడా ఉన్నానని బన్నీ చెప్పుకోవడానికి బాసటగా నిలిచిన సినిమా ‘అల వైకుంఠపురంలో’. నిజంగా ఈ సినిమా తెలుగులో ఓ సంచలనం, ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ రేంజ్ ని పెంచింది. తమన్ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అయింది.

అన్నిటికీ మించి ఈ సినిమా బయ్యర్లకు డిస్టిబ్యూటర్స్ కు కాసుల వర్షం కురిపించింది. ఎంతోమందికి ఈ సినిమా గొప్ప విజయాన్ని అందించింది. అందుకే ఈ సినిమా కోసం మిగిలిన బాషల వాళ్ళు కూడా ఎంతో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో తాజాగా హిందీలో ఈ సినిమాని ‘షెహజాదా’ (రాకుమారుడు) అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. చిత్రబృందం తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది.
నవంబర్ 4, 2022న ఈ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ కాబోతుంది. బన్నీ పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. మరి బన్నీ కెరీర్ కు ఊపు తెచ్చిన ఈ సినిమా, కార్తీక్ ఆర్యన్ కు కూడా అంతే ఊపు తెస్తుందా ? మరో పక్క కృతి సనాన్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ ధావన్ ఈ సినిమాకి దర్శకుడు. టేకింగ్ విషయంలో షాట్ మేకింగ్ విషయంలో రోహిత్ ధావన్ మంచి విషయం ఉన్న దర్శకుడు.
కాబట్టి.. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తోందని బాలీవుడ్ లో అంచనాలు ఉన్నాయి. మరోపక్క కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే ‘బుట్ట బొమ్మ’ తెలుగు సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పెట్టాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది కూడా. ఇక ఈ సినిమా కథలో పెద్దగా మార్పులు చేయలేదు. ఉన్న స్క్రిప్ట్ నే పకడ్బందీగా తీసుకుని చేస్తున్నారు.
Also Read: Balakrishna: బాలయ్య గొప్పతనానికి ఇదే నిదర్శనం !
అయితే, ఇక్కడ ఒక సమస్య అది. ఇంతవరకు త్రివిక్రమ్ సినిమాలు ఏవీ ఇతర భాషల్లో విజయాలు సాధించలేదు. కానీ తెలుగులో మాత్రం త్రివిక్రమ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ తమిళ, హిందీ భాషల్లో రీమేకులుగా వెళ్లి నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పుడు మేకర్స్ లో కూడా అదే భయం పట్టుకుంది. మరి చూడాలి, ఈ సినిమా భవితవ్యం ఎలా ఉంటుందో.
Also Read: Prabhas: డబుల్ యాక్షన్ లో ప్రభాస్ క్రేజీ యాక్షన్ ?