Homeజాతీయ వార్తలుMAA Elections: ప్చ్.. అసలు ప్రకాష్ రాజ్ కి ఏమైంది ?

MAA Elections: ప్చ్.. అసలు ప్రకాష్ రాజ్ కి ఏమైంది ?

MAA Elections
Prakash Raj

MAA Elections: ‘మా’ ఎన్నికల వేడి ఇప్పట్లో తగ్గేలా లేదు. అసలు ప్రకాష్ రాజ్ కి ఏమైంది ? ఆయనకు షూటింగ్స్ లేవా ? లేక ట్రాక్ తప్పాడా ? ఎన్నికలు ముగిసినా విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఆ వేడిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అసలు ఎందుకు ప్రకాష్ రాజ్ ఇంకా ‘మా’ ఎన్నికలను పట్టుకుని వేలాడుతున్నాడు ? ఎప్పటికప్పుడు జరిగిన పరిణామాల పై కౌంటర్లు ఇస్తూ అగ్గిని రాజేస్తూనే ఉన్నాడు.

నిజంగా ప్రకాష్ రాజ్ సేవే చేయాలి అనుకుంటే.. సొంతంగా ఒక ట్రస్ట్ పెట్టుకుని చెయ్యొచ్చు. ఎలాగూ సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ, ప్రకాష్ రాజ్ చేస్తుంది ఏమిటి ? ఓటమికి కారణాలు వెతుక్కుంటూ అడ్డమైన సాకులు చెబుతూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. పైగా తన వల్ల తన ప్యానెల్ తరఫున గెలిచిన 11 మంది చేత రాజీనామా చేయించాడు.

తాజాగా ‘మా’ ఎన్నికల(MAA Elections) సమయంలో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్‌ ని ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ కి ఒక లెటర్ రాశాడు. అయితే ప్రకాశ్‌ రాజ్‌ ఈ లెటర్ లో పొందుపరిచిన అంశాలు గెలిచిన ప్యానెల్ కి చాలా ఆవేశాన్ని రగిలించేలా ఉంది. మా ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేదు అని ప్రకాష్ రాజ్ ఎలా చెప్పగలడు ? ఒకవేళ ప్రకాష్ రాజ్ ఆరోపణల్లో నిజం ఉంది అనుకుంటే… ఆ రోజు ప్రకాష్ రాజ్ ఏం చేశాడు ?

మంచు విష్ణుతో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. కానీ ఇప్పుడు ఏమి అంటున్నాడు ? ఎన్నికల రోజు ఎన్నో భయంకర ఘటనలు జరిగాయని, మోహన్‌ బాబు, నరేశ్‌ ప్రవర్తన దారుణంగా ఉందని ప్రకాష్ రాజ్ లెటర్ లో రాసుకొచ్చాడు. కచ్చితంగా ఇది ప్రకాష్ రాజ్ లేకి తనానికి చేతగానితనానికి సింబాలిజమ్ అనుకోవాలి. లేకపోతే, కొందరు ‘మా’ సభ్యులపై వారు దాడి చేశారని ఎందుకు చెబుతాడు ?

మరి దాడి చేసినప్పుడు ప్రకాష్ రాజ్ ఏమి చేస్తున్నట్లు ? పోలింగ్‌ సమయంలో సీసీ కెమెరాల గురించి ఇప్పుడు అడుగుతున్నారు. తన ఓటమికి కారణం వేరే ఎవరో అని చాటి చెప్పడానికా ? పైగా సీసీ ఫుటేజ్‌ డిలిట్‌ అయ్యే అవకాశాలున్నాయని అంటాడా ? అంటే, మోహన్ బాబు బృందం ఆ సీసీ ఫుటేజ్‌ డిలేట్ చేస్తోంది అనేగా ? ప్రకాశ్‌ రాజ్‌ ఇప్పటికైనా పద్దతి మారిస్తే బెటర్. ఇక ఎన్నికలను పూర్తిగా మర్చిపోయే, పని పై ఆయన తన ఏకాగ్రత పెట్టాలని ఆశిద్దాం.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version