
భద్రతా కారణాలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్ర కోటను ఆగస్టు 15వరకు మూసివేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతా కారణాలతో పాటు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్ట్ 15 వరకు ఎర్ర కోటను మూసివేయాలని కోరుతూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఢిల్లీ పోలీసులు ఈ నెల 12న లేఖ రాశారు. ఈనెల 21 నుంచి ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య వజ్రోత్సవం ముగిసే వరకు ఎర్ర కోటలోకి సందర్శకులను అనుమతించబోమని తెలిపింది.