బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా పిల్లలు వచ్చి దీప కనిపించడం లేదని చెప్పడంతో కార్తీక్ సౌందర్య కంగారు పడతారు. దీపా ఎక్కడికి వెళ్లి ఉంటుందని ఆలోచిస్తారు. ఇక ప్రియమణి బయట గుమ్మం దగ్గర నిలబడి కంగారు పడుతూ కనిపిస్తుంది. అది చూసిన సౌందర్య ఏంటే ఇక్కడున్నావ్ అని అడగగా.. అమ్మ అది మోనితమ్మ ఫోన్ చేసిందమ్మ అవునా ఏం చెప్పింది అని సౌందర్య అడగగా మగపిల్లాడు పుట్టాడంట కదమ్మ..మన కార్తీక్ బాబు తండ్రిగా సంతకం చేసాడంట కదా అని అనగానే సౌందర్య మెల్లగా..దీపకు ఈ విషయం చెప్పలేదు కదా అని అడగడంతో లేదమ్మా అంటూ ప్రియమణి సమాధానం చెబుతుంది. ఇక ఇక్కడి నుంచి వెళ్ళు అని సౌందర్య చెప్పడంతో ప్రియమణి ముందుకు వెళ్లి తిరిగి మరి ఆగుతుంది.
అమ్మ అది మగపిల్లాడు మెడకు పేగు వేసుకొని పుట్టాడట కదా… అలా పుడితే మేనమామకు, తండ్రికి గండం ఉంటుందంట కదా.. అనగానే సౌందర్య షాక్ అవుతుంది. మేనమామ వాళ్లయితే ఎవరు లేరు ఇక తండ్రి కార్తీక్ బాబే కదమ్మా ఏదో శాంతి పూజలు చేయిస్తారు అంట కదా అంటూ అసలు విషయం బయటపడటంతో సౌందర్య కోపం తెచ్చుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని పంపిస్తుంది. ఇక మనసులోనే ఈ విషయం నేను కూడా విన్నాను తండ్రికి గండం అని అనుకుంటుంది. ఇక ల్యాబ్ కు వెళ్ళిన దీప ల్యాబ్ యజమానిని కలిసి అసలు విషయం నిలదీస్తుంది. అక్కడ డాక్టర్ కూడా అచ్చం పల్లవి చెప్పిన విధంగానే సమాధానం చెబుతాడు. మేము ఎవరికీ ఇక్కడినుంచి శాంపుల్ ఇవ్వము.. మీరు కేసు పెట్టిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో దీపా షాక్ అవుతుంది. ఇక మోనిత మాటలను డాక్టర్ మాటలను వింటూ అక్కడినుంచి వెళ్లిపోతుంది.
ఇక బయట వారణాసి సెల్ చూసుకుంటూ ఉండగా దీపా అక్కడ కారు ఉండటం కూడా గమనించకుండా వెళ్ళిపోతుంది. అది వారణాసి గమనించి ఉండడు. కార్తీక్ దీపకు చేసిన అన్యాయం గురించి మదనపడుతూ కూర్చుండగా పిల్లలు కార్తీక్ దగ్గరకు వెళ్లి అమ్మ ఈ మధ్య నవ్వుతూ మాట్లాడటమే లేదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.మేము మిమ్మల్ని ప్రశ్నలు వేయటం లేదు కదా మాతో సరదాగా ఉండొచ్చు కదా అంటూ పిల్లలు నిలదీయడంతో కార్తీక్ వారిని బుజ్జగించే ఇకపై అని సంతోషంగా ఉందాం అంటూ సమాధానం చెప్పినప్పటికీ మనసులో అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక హాస్పిటలోకి వెళ్లిన భారతినీ చూసిన మోనిత భారతి నీ కూతురు ఎలా బారసాల చేసావు అని అడుగుతుంది. ఇప్పుడేంటి మోనిత నీ కొడుకు కూడా బారసాల చేస్తావా అని భారతి అడగగా చేస్తే తప్పేముంది వీడు ద గ్రేట్ ఆనందరావు మనవడు ఇద్దరు డాక్టర్స్ కొడుకు బారసాల చేస్తే తప్పేముంది భారతి అంటుంది.మోనిత నీ ఆలోచనలు బాగున్నాయి ఆచరణ కష్టం అవుతుందేమో చూడు అని భారతి అంటూ ఇలాంటి గొడవలు పెట్టుకుంటే కార్తీక్ నీకు దగ్గర అవుతాడ అని భారతి నిలదీస్తుంది.చూస్తూ ఉండు భారతి ఆల్రెడీ నేను బాణం వేసాను రేపొద్దున వీళ్ళ నాన్నమ్మ గుడికి వెళ్లి శాంతి పూజలు చేయిస్తుంది చూడు ..అంతే కదరా నాన్నా అంటూ కొడుకుని చూస్తూ మురిసిపోతుంది. ఇక నీకు ఎంత చెప్పినా వేస్ట్ అనుకొని భారతి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.