Karthika Deepam Serial: సీరియల్స్ లో కార్తీకదీపం రారాజుగా ఉంది. ఈ సీరియస్ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏళ్ల తరబడి టాప్ రేటెడ్ సీరియల్ గా కొనసాగుతుంది. కార్తీకదీపం సీరియల్ టీఆర్పీ అసమాన రికార్డ్స్ నమోదు చేసింది. స్టార్ మా లో ప్రతిరోజు సాయంత్రం 7:30 నిమిషాలకు కార్తీకదీపం ప్రసారం అవుతుంది. ఆ సమయానికి బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఛానల్ మార్చకుండా సీరియల్ పూర్తి అయ్యే వరకు కన్నార్పకుండా చూస్తారు. 2017 అక్టోబర్ 16న కార్తీకదీపం సీరియల్ మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. 5 సంవత్సరాలుగా ఈ సీరియల్ నంబర్ పొజిషన్ లో కొనసాగుతుంది.

కార్తీక్, దీప పాత్రలు ఇంట్లో కుటుంబ సభ్యులు అయిపోయారు. ఈ సీరియల్ లేడీ విలన్ మోనితను కార్తీకదీపం ఫ్యాన్స్ ఒక రేంజ్ లో తిట్టుకుంటారు. దీప క్యారెక్టర్ కి మరో పేరు వంటలక్క కాగా ఆమె భర్త కార్తీక్ ని డాక్టర్ బాబు అని పిలుచుకుంటుంది. వంటలక్క, డాక్టర్ బాబు గానే వారిద్దరూ బాగా ఫేమస్. కార్తీకదీపం సీరియల్ కథ చెప్పాలంటే వంటలక్క-డాక్టర్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కార్తీక్ ని విపరీతంగా ప్రేమించిన మోనిత ఎలాగైనా అతనికి దీపను దూరం చేసి తన సొంతం చేసుకోవాలి అంటుకుంటుంది.
డైరెక్టర్ ఈ మధ్య వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్స్ ని చంపేశాడు. వారి ఇద్దరు కూతుళ్లతో సీరియల్ సరికొత్తగా నడిపే ప్రయత్నం చేశాడు. వంటలక్క, డాక్టర్ బాబు లేని కార్తీకదీపం సీరియల్ ని ప్రేక్షకులు ఊహించలేకపోయారు. టీఆర్పీ ఢమాల్ న క్రిందకు పడిపోయింది. చేసిన తప్పు తెలిసి.. వారిద్దరూ బ్రతికే ఉన్నారని వెంటనే రంగంలోకి దింపాడు.

డాక్టర్ బాబు, వంటలక్క ఎంట్రీతో మరలా పూర్వ వైభవం కార్తీకదీపం సీరియల్ కి వచ్చింది. కాగా కార్తీక దీపం మరో అరుదైన మైలురాయిని అందుకుంది. 1500 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. దీంతో వంటలక్క 15వ సెంచరీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది అంటున్నారు. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్, శోభా శెట్టి ప్రధాన పాత్రలు చేస్తున్న కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్ గా కాపుగంటి రాజేంద్ర ఉన్నారు. ఐదేళ్ల ప్రయాణం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న కార్తీకదీపం భవిష్యత్ లో ఇంకెన్ని సంచలనాలు చేయనుందో చూడాలి.