Sudigali Sudheer Gaalodu: జబర్ధస్త్ తో పాపులర్ కమెడియన్ గా, యాంకర్ గా ఎదిగిన సుడిగాలి సుధీర్ అడపాదడపా సినిమాల్లోనూ హీరోగా నటిస్తున్నాడు. కొన్ని పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తున్నాడు. ఇన్నాళ్లు కొన్ని కామెడీ, లవ్ స్టోరీలు చేసిన సుధీర్ ఇప్పుడు ఏకంగా మాస్ హీరోగా అవతారం ఎత్తాడు. హీరోగా సుధీర్ కు సరైన బ్రేక్ రాలేదు.. కానీ ‘గాలోడు’ సినిమాతో సుధీర్ కు బ్రేక్ వచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో సుధీర్ పవర్ ఫుల్ మాస్ హీరోగా లాంచ్ కాబోతున్నాడు. తాజాగా సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పక్కా మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందింది.

గాలోడు సినిమాలో సుధీర్ హీరోగా, గెహ్నా సిప్పి హీరోయిన్ గా నటించింది. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వచ్చిది. తాజాగా ‘గాలోడు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ చూస్తుంటే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపిస్తోంది. ముందు అమ్మాయిని ప్రేమించడం.. ఆమె కోసం తిరగడం ఆ తర్వాత విలన్స్ ఎంట్రీ జైలుకు వెళ్లడం చూస్తుంటే స్టోరీలో మాస్ మసాలా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఫైట్స్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. పవర్ ఫుల్ డైలాగులు.. హీరోయిన్ గ్లామర్, సప్తగిరి కామెడీ ట్రైలర్ కు బలంగా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు అదనపు బలంగా ఉంది. ఫృథ్వీరాజ్, షకలక శంకర్, సత్యక్రిష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను నవంబర్ 18న విడుదల చేస్తున్నారు.
మొదట కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి.. అనంతరం సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారిన సుధీర్ ఇప్పుడు మాస్ హీరోగా ప్రయత్నిస్తున్నాడు. ‘గాలోడు’తో పవర్ ఫుల్ మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా వెండితెరపై ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది వేచిచూడాలి.