Bigg Boss 6 Telugu- Revanth: ప్రారంభంలో కాస్త స్లోగా బోరింగ్ గా కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 6 గత కొద్దీ వారాల నుండి కాక మీద కొనసాగవుతుంది.. టాస్కు వస్తే చాలు ఇంటి సభ్యులందరూ క్రూరమృగాల కంటే దారుణంగా ఆడేస్తున్నారు.. గత సీజన్స్ లో కూడా కంటెస్టెంట్స్ ఇలాగే ఆడేవారు కానీ..ఎంత ఫిజికల్ అయినా కూడా నోరు అదుపు తప్పకుండా చూసుకునేవారు..కానీ ఈ సీజన్ లో చాలా మంది కంటెస్టెంట్స్ హద్దులన్నీ దాటేస్తున్నారు..మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రేవంత్ గురించి.. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే ఇతని ప్రవర్తనతో ఇంటి సభ్యులకి ఇబ్బందే అని చెప్పాలి.

టాస్కులు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ కూడా నోరుని అదుపు చేసుకునే విషయంలో అసలు మనిషిలాగా ప్రవర్తించడని నెటిజెన్స్ ట్రోల్ల్స్ చేస్తున్నారు.. ఇదే విషయాన్ని నాగార్జున అనేక సార్లు చెప్పినా కూడా అతని ప్రవర్తనలో ఇసుమంత మార్పు కూడా లేదు..ఈ వారం అయితే అతను హద్దులన్నీ చెరిపేసాడు.. బయట మనం ఎలాంటి బూతులు వింటామో అలాంటి బూతులు బిగ్ బాస్ హౌస్ లో వాడాడు.
ఆది రెడ్డితో ఫిజికల్ టాస్కు ఆడుతున్నప్పుడు రేవంత్ కు గోరు పొరపాటున గీసుకుంటే ‘నా కొడకా’ అని తిడుతాడు.. ఇక నిన్న జరిగిన ఫిజికల్ టాస్కులో కూడా రోహిత్ ని పట్టుకొని ‘నీ అమ్మ’ అని తిడుతాడు.. ఎప్పుడు ప్రశాంతంగా సౌమ్యంగా ఉండే రోహిత్ కూడా రేవంత్ మాట్లాడిన ఆ మాటలకు చాలా తీవ్రంగా కోపం తెచ్చుకుంటాడు.. ఇవన్నీ చూస్తుంటే ఈ వారం రేవంత్ కి నాగార్జున చేతిలో చాలా సీరియస్ వార్నింగ్ రావడం ఖాయం అని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న మరో రూమర్ ఏమిటి అంటే.. ఎన్నిసార్లు చెప్పినా పద్దతి మార్చుకోకపోవడంతో నాగార్జున ‘రెడ్ కార్డు’ ఇచ్చి రేవంత్ ని హౌస్ నుండి బయటకి గెంటేయబోతున్నారా అనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది.. అంత దూరం వరకు వస్తుందో లేదో తెలియదు కానీ నాగార్జున మాత్రం చాలా సీరియస్ గా ఫైర్ అవ్వడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.. చూడాలి మరి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది.