Homeఎంటర్టైన్మెంట్Premi Vishwanath Son: సిక్స్ ప్యాక్ బాడీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కార్తీక దీపం...

Premi Vishwanath Son: సిక్స్ ప్యాక్ బాడీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కార్తీక దీపం వంటలక్క కొడుకు… ఇంత పెద్ద పిల్లోడు ఉన్నాడా? ఆమె వయసెంత?

Premi Vishwanath Son: బుల్లితెర ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్ సీరియల్ గా ఉంది కార్తీకదీపం. తెలుగు రాష్ట్రాల్లో ఈ ధారావాహిక సంచలనం సృష్టించింది. ఏళ్ల తరబడి టాప్ రేటెడ్ సీరియల్ గా కొనసాగింది. సాయంత్రం 7.30 గంటల సమయం అయిందంటే చాలు… కార్తీక దీపం సీరియల్ బీజీఎమ్ ప్రతి ఇంట్లో వినిపించేది. జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.

కార్తీకదీపం కి ఇంతటి క్రేజ్ దక్కడంలో దీప గా నటించిన ప్రేమి విశ్వనాథ్ పాత్ర ఎంతైనా ఉంది. ఆమె పండించిన ఎమోషనల్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రేమి విశ్వనాథ్ మలయాళీ నటి అయినప్పటికీ ఆమెకు తెలుగులో పాపులారిటీ రాబట్టింది. కార్తీకదీపం సీరియల్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. కార్తీకదీపం ముగిసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కార్తీకదీపం ఇది నవ వసంతం అంటూ పార్ట్ 2 ను ప్రారంభించారు.

కార్తీక దీపం 2 సీరియల్ కి పాత కథతో ఎలాంటి కనెక్షన్ లేదు. ఇది పూర్తిగా కొత్త కథ. కొన్ని పాత్రల పేర్లు వాడుకున్నారు. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగం అంత కాకపోయినా కార్తీకదీపం 2 కూడా పర్వాలేదు అనిపించుకుంటుంది. ఇది పక్కన పెడితే .. ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ గురించి ఆడియన్స్ కి తెలిసింది తక్కువ. ఆమె భర్త, పిల్లలకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రేమి సోషల్ మీడియాలో షేర్ చేయరు.

అయితే తాజాగా ప్రేమి తన కొడుకుతో కలిసి ఓ రీల్ చేసింది. అది సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వంటలక్క సంతూర్ మమ్మీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వంటలక్క కొడుకు సిక్స్ ప్యాక్ బాడీతో హీరోలా ఉన్నాడు. ప్రేమి విశ్వనాథ్ తన కొడుకుని నటుడిగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Manujith (@_.maaaaaaaanu)

RELATED ARTICLES

Most Popular