Director Buchibabu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వాళ్ళ సత్తాను చూపించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేయబోతున్న సినిమాలతో సూపర్ స్టార్ డమ్ ని అందుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్ తో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో బుచ్చిబాబు తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. బుచ్చిబాబు ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో స్టార్ డమ్ ను అందుకోవడమే కాకుండా ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను సైతం డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు.
Also Read : రేపే ‘ఆదిత్య 369’ రీ రిలీజ్..అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!
మరి ఈ సినిమా తర్వాత ఆయన మరొక స్టార్ హీరో తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఆయన ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ గా తెలుస్తోంది…ఇక బుచ్చిబాబు సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ తో అతనికి చాలా మంచి సన్నిహిత సంబంధమైతే ఏర్పడింది.
నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్న సమయంలో బుచ్చిబాబు ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే కుదిరింది. అయితే బుచ్చిబాబు తన రెండో సినిమాని ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు అయితే పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
అందుకే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని బుచ్చిబాబు తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బుచ్చిబాబు సైతం గతంలో ఎన్టీఆర్ కి ఒక స్టోరీ లైన్ కూడా వినిపించారట. ఆ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో అదే కథతో మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
Also Read : కార్తీక దీపం’ వంటలక్క రెమ్యూనరేషన్ తో ఒక సినిమానే తీసేయొచ్చు తెలుసా!