Aditya 369 re-release : మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సినిమాలలో ఒకటి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘ఆదిత్య 369′(Aditya 369). ఆరోజుల్లో ఈ సినిమా ఒక ప్రభంజనం, సింగీతం శ్రీనివాసరావు(Singeetham srinivasa rao) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే నేటి తరం ఆడియన్స్ కూడా ఎంతో ఇష్టపడి చూస్తుంటారు. బాలకృష్ణ సినిమాలలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏమిటి? అని ఎవరినైనా అడిగితే, ఒక్క క్షణం కూడా ప్రతీ ఒక్కరు ఆలోచించకుండా చెప్పే పేరు ‘ఆదిత్య 369’. ఇండియా లోనే మొట్టమొదటి టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని లేటెస్ట్ 4K టెక్నాలజీ కి మార్చి, డాల్బీ అట్మాస్ సౌండ్ ని మిక్స్ చేసి రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి వారం రోజులు దాటింది. ఈ బుకింగ్స్ ద్వారా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
Also Read : విడుదలకు ముందే 750 కోట్లు..చరిత్ర సృష్టించిన రజినీకాంత్ ‘కూలీ’
ఆన్లైన్ లో ట్రాకింగ్ అయిన షోస్ ప్రకారం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 లక్షల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది గొప్ప గ్రాస్ నెంబర్ కాకపోయినా, విడుదల తర్వాత కచ్చితంగా కౌంటర్ బుకింగ్స్ భారీగా ఉంటాయని, అదే విధంగా లాంగ్ రన్ కూడా బలంగా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, నెల్లూరు మరియు ఇతర సిటీస్ లలో మీ అభిమాన థియేటర్స్ లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. కచ్చితంగా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. టీవీ లో చూసినప్పుడే మీకు సరికొత్త అనుభూతి కలిగింది, ఇక థియేటర్స్ లో ఇలాంటి సినిమాలు చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో మీరే ఊహించుకోండి. చిన్నతనంలో నేటి తరం యువత మొత్తం ఈ సినిమాని టీవీ లో వీక్షించినవారే.
నేటి తరం నందమూరి అభిమానులు కూడా ఈ క్యాటగిరీలోకే వస్తారు. కాబట్టి వీళ్లంతా థియేటర్స్ కి కదిలి ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతారో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని, దానికి దర్శకత్వం తానే వహిస్తాను అంటూ నందమూరి బాలకృష్ణ అనేక సందర్భాలలో చెప్పుకొచ్చాడు. తన తనయుడు మోక్షజ్ఞ ని హీరో గా పెట్టి ఈ సినిమా తీస్తాడట. బాలయ్య తన కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలను చేసాడు, కానీ ఈ సినిమా పై ఆయన ప్రత్యేకమైన అభిమానం చూపిస్తాడు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇకపోతే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని మంచి ఊపు మీదున్న బాలయ్య, ప్రస్తుతం ‘అఖండ 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.