బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా దోష నివారణ పూజ తర్వాత మోనిత కార్తీక్ తో చాలా ఓవయాక్షన్ చేస్తోంది. కావలసిగానే కార్తీక్ దగ్గరికి వెళ్లడం మీ కొడుకుని ఎత్తుకొని అని చెప్పడంతో కార్తీక్ ఎంతో అసహ్యించుకుంటారు. ఇక మోనిత మాట్లాడుతూ బుల్లి ఆనంద రావుగారు మీ డాడి వెళ్తున్నారు.. నిన్ను తీసుకుని మీ అక్కల దగ్గర ఆడించమని చెప్పండి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాటలకు విసుక్కుంటూ పద మమ్మి వెళ్దాం అంటూ వెళతాడు. అప్పుడు ప్రియమణి మోనిత వంక జాలిగా చూస్తూ ఉండటంతో ఎందుకు అలా జాలిగా చూస్తున్నావ్ ఇది నా విజయం ప్రియమణి అంటుంది.
ఇక కార్తీక్ దీప గుడికి వచ్చింది మమ్మీ అని అనడంతో అలా జరగదు కేవలం నీ ఊహ అయ్యి ఉంటుంది అంటూ సౌందర్య చెబుతుంది. ఇక కార్తీక్ ఇంటికి వెళ్లగానే అక్కడ వారణాసి మరొక కారు క్లీన్ చేస్తుంటాడు.ఇక సౌందర్య కార్తీక్ రావడం చూసి దీపక్క వీళ్ళతో కలిసి రాలేదే అంటూనే దీపక్క ఏది బాబు అని అడుగుతాడు. బయటకు వెళ్తుంటే గుడి దగ్గర మీ కారు కనబడితే దీపమ్మ మీ కారులో వస్తానని చెప్పి నన్ను ఇంటికి పంపిందని వారణాసి చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.
దీప నిజంగానే గుడికి వచ్చింది అక్కడ జరిగింది అంతా చూసింది అంటూ కార్తీక్ లోపలికి వెళ్లి మెట్లపై కూలబడతాడు. ఇప్పుడు దీపకు నా మొహం ఎలా చూపించాలి మమ్మీ ఏం చేయాలి? దీప నన్ను క్షమిస్తుందా? అసలు దీప నా మొహం చూస్తుందా అంటూ ఏడుస్తాడు. ఆ మాటలకు సౌందర్య అంతా అయిపోయింది రా పెద్దోడా ఇప్పుడు దీపను ఎలా ఎదుర్కోవాలి అంటూ బాధపడతారు. అంతలో ఆనందరావు వచ్చి దీప ఇంటికి రాదు అందరూ తనని మర్చిపోండి ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి వెళితే మీ పెద్దకోడలు ఎక్కడ అంటూ అందరూ అడిగే ప్రశ్నకు సమాధానం ఉండదు అంటూ కార్తీక్ పై కోపం తెచ్చుకుంటాడు.
ఇక దీప అక్కడ విషయాలను తెలుసుకొని దీనంగా నడుస్తూ బస్తీకి వెళుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ డాక్టర్ బాబు ఇంత మోసం చేస్తాడా పంచాయతీ పెట్టాల్సిందే దీప కు న్యాయం చేయాల్సిందేనంటూ అందరూ మాట్లాడటం ఊహించుకొని దీప బస్తీకి వెళ్ళకుండా వెనకడుగు వేస్తుంది. అక్కడికి వెళ్ళిన జరిగేది ఇదే కదా అంటూ ఏడుస్తూ తన దారి మార్చుకుంటుంది. అయితే దీప ఎక్కడికి వెళ్ళింది తర్వాత ఏం చేయబోతుంది అనే విషయాలు తర్వాత ఎపిసోడ్ లో చూడాల్సి ఉంది.