
ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ నుంచి మూడో సినిమాగా “పుష్పక విమానం” రాబోతుంది. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. మరి ఈ పుష్పక విమానం ఎలా మొదలైంది ? అని ఆనంద్ ను కదిపితే.. అతను చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఆనంద్ మాటల్లోనే.. ‘ఈ సినిమా దర్శకుడు దామోదర. ఆయన మా అన్నయకి ఫ్రెండ్. ఓ రోజు కలిసినప్పుడు ఆయన నాకు ఈ కథ చెప్పారు.
నిజానికి ఈ కథను వేరే హీరోలతో తీయాలని ప్లాన్ చేశాము. అయితే, “హీరో పెళ్ళాం లేచిపోతుంది” అనే కాన్సెప్ట్ కారణంగా ఏ హీరో ముందుకు రాలేదు. దాంతో, నేను నటించాను. అందరూ ట్రైలర్ బాగుంది అంటున్నారు. సినిమా కూడా కామెడిగానే ఉంటుంది. నేను ఇందులో చిట్టిలంక సుందర్ అనే టీచర్ గా నటించాను. పెళ్లయిన కొద్దీ రోజులకే భార్య లేచిపోతే ఏమిటి పరిస్థితి ?
అతను ఎలా రియాక్ట్ అవుతాడు ? అసలు అతని పొజిషన్ ఏమిటి ? అనే కోణంలో ఈ సినిమా చేశాము అంటూ ఆనంద్ తెలిపాడు. ఐతే, ఈ సినిమాలో కామెడీతో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉందట. అలాగే ఈ సినిమాలో పెళ్లి గురించి ఓ మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విజయ్ దేవరకొండ టీమ్ కూడా చూసిందట.
Also Read: RRR: “ఆర్ఆర్ఆర్” టాక్ పైనే ‘బంగార్రాజు’ ఆధారం !
అందరికీ సినిమా చాలా బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేద్దామని విజయ్ దేవరకొండ ముందుకొచ్చి మరీ బాగా ప్రమోట్ చేస్తున్నాడు. మరి రేపు సినిమా రిలీజ్ అయ్యాక గానీ సినిమా ఎలా ఉందనే అసలు విషయం తెలియదు.
Also Read: Tarun Bhaskar: డైరెక్షన్ వదిలేసి ఎంజాయ్ చేస్తున్నాడు !