https://oktelugu.com/

Karthika Deepam: మోనితకి వార్నింగ్ ఇచ్చిన దీప..షాక్ లో కార్తీక్, సౌందర్య?

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప గుడిలో జరిగిన పూజ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఇంత పోరాడిన చివరికి నాకు దక్కిన ఫలితం ఏముంది అంటూ బాధపడుతుంది. గతంలో తన పిన్ని తనని పెట్టిన బాధలు తలుచుకుంటూ కుమిలిపోతుంది. పుట్టింటిలో భరోసా లేదు మెట్టినింటిలో నమ్మకం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2021 / 11:26 AM IST
    Follow us on

    బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప గుడిలో జరిగిన పూజ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఇంత పోరాడిన చివరికి నాకు దక్కిన ఫలితం ఏముంది అంటూ బాధపడుతుంది. గతంలో తన పిన్ని తనని పెట్టిన బాధలు తలుచుకుంటూ కుమిలిపోతుంది. పుట్టింటిలో భరోసా లేదు మెట్టినింటిలో నమ్మకం లేదు అందరూ నన్నే మోసం చేస్తున్నారు అంటూ కుమిలిపోతుంది.

    ఒకవైపు తాను పడుతున్న బాధలను తలుచుకుంటూ బాధపడటమే కాకుండా మరో వైపు పిల్లలను గుర్తు చేసుకుని బాధపడుతుంది.ఇలా జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఒక్కసారిగా లేచి కళ్ళు తుడుచుకొని ధైర్యంగా మోనిత ఇంటి వైపు ప్రయాణం చేస్తుంది. ఇక మోనిత తాను విజయం సాధించాలని ప్రియమణితో చెబుతూ ఎంతో మురిసి పోతుంది.ఇక కేవలం కొంత మాత్రమే మిగిలి ఉంది ఆ దీపను బయటకు తోయడం నేను ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం అంటూ చెబుతుండగా దీప ఎదురుగా కనిపించేసరికి మోనిత షాక్ అవుతుంది.

    ఒక్కసారిగా దీపను చూసిన మోనిత కాస్త ఓవరాక్షన్ చేస్తుంది. ఏ దిక్కు లేక మీ చెల్లి దగ్గరికి వచ్చావా దీపక్క.. కాళ్ల బేరం కోసం ఇక్కడికి వచ్చావా.. ఏదైనా ప్యాకేజీ కోసం ఇక్కడికి వచ్చావు అంటూ ఎంతో వెటకారంగా మాట్లాడుతుంది. ఇక నీ సినిమా ఫ్లాప్ అయింది దీపక్క అంటూ మోనిత ఓవరాక్షన్ చేయడంతో
    మోనిత మాటలు అయిపోయిన తర్వాత దీప తనదైన స్టైల్ లో వెళ్లి సోఫా పై కాలుపై కాలు వేసుకుని కూర్చుంటుంది. అది చూసిన మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది.

    దీప మోనితను ఉద్దేశించి తనకు అర్థమయ్యేలా ఒక కథ చెబుతూ మోనితను షాక్ కి గురి చేస్తుంది. దీప మాటలు విన్న మోనిత ఒక్కసారిగా భయంతో వణుకుతుంది.దీన్ని బట్టి చూస్తే దీపా ఏదో మరొక కొత్త ప్లాన్ వేసినట్టు అర్థమవుతుంది. అయితే దీప ప్లాన్ ఏంటి నిజంగానే మోనిత దూరం చేస్తుందా లేక తనే కార్తీక్ కి దూరం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.