https://oktelugu.com/

Upasana Konidela: పిల్లలు ఎప్పుడు అనే ప్రశ్నకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన మెగా కోడలు?

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలిసిందే.ఈమె మెగాస్టార్ చిరంజీవి కోడలిగా మాత్రమే కాకుండా అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా అందరికీ సుపరిచితమే. ఉపాసన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని తనదైన శైలిలో అందరికీ సహాయం చేస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు చేపడుతున్న మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసనకు నిత్యం ఒక ప్రశ్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2021 / 11:40 AM IST
    Follow us on

    Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలిసిందే.ఈమె మెగాస్టార్ చిరంజీవి కోడలిగా మాత్రమే కాకుండా అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా అందరికీ సుపరిచితమే. ఉపాసన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని తనదైన శైలిలో అందరికీ సహాయం చేస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు చేపడుతున్న మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసనకు నిత్యం ఒక ప్రశ్న వేధిస్తూనే ఉంది.

    ఇవి కూడా చదవండి:Pushpaka Vimanam: మా అన్నయ తో సంబంధం లేదు – ఆనంద్ దేవరకొండ

    ఉపాసన రామ్ చరణ్ వివాహం జరిగి సుమారు ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు వీరు పిల్లల గురించి ప్లాన్ చేసుకోలేదు. రామ్ చరణ్ తో పాటు వివాహం చేసుకున్న అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.అయితే రామ్ చరణ్ దంపతులు మాత్రం ఇప్పటివరకు పిల్లల గురించి ప్లాన్ చేసుకోకపోవడంతో ఎక్కడికి వెళ్ళినా ఉపాసనకు ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ఇలాంటి ప్రశ్న ఎదురవడంతో ఉపాసన కాస్త ఇబ్బంది పడుతుందని తెలుస్తోంది.

    తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనకి ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ బుల్లి రామ్ చరణ్ ఉపాసనను ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటూ ప్రశ్నించడంతో ఒక్కసారిగా యాంకర్ ప్రశ్నపై ఉపాసన అసహనం వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. పిల్లలు గురించి ఆలోచించడం పూర్తిగా తన వ్యక్తిగత విషయం అనినేను ఇప్పుడు ఏ సమాధానం చెప్పినా అది ఒక సెన్సేషనల్ అవుతుంది అన్న విషయం నాకు తెలుసు కనుక ఈ ప్రశ్న పై సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కచ్చితంగా ఒక రోజు జవాబు చెప్పాల్సి వస్తుంది కనుక ఆరోజు తప్పకుండా చెబుతానని ఈ సందర్భంగా మెగా కోడలు పిల్లల గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

    ఇవి కూడా చదవండి: Karthika Deepam: మోనితకి వార్నింగ్ ఇచ్చిన దీప..షాక్ లో కార్తీక్, సౌందర్య?