OG 2 Pawan Kalyan Remuneration: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల 12 ఏళ్ళ ఆకలి ని తీర్చిన చిత్రం ‘ఓజీ'(They Call Him OG). సెప్టెంబర్ 25 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ రన్ తో థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది. సినిమా లో పెద్దగా మ్యాటర్ లేదు, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే చూడదగిన సినిమా అంటూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే కొన్ని వర్గాలు తీవ్రమైన వ్యతికరేకత చూపిస్తాయి. వాళ్ళు అయితే ఈ సినిమా విడుదలైన అర్థ రాత్రి నుండే డిజాస్టర్ ఓజీ అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. ఎన్నో వందల నెగిటివ్ రివ్యూ ఆర్టికల్స్ పడ్డాయి. వాటి అన్నిటిని ఎదురుకొని ఈ చిత్రానికి 308 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 180 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇదంతా పక్కన పెడితే ఓజీ చిత్రానికి సీక్వెల్ , ప్రీక్వెల్ ఉంటాయి, నటించడానికి నేను సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. సక్సెస్ మీట్ లో మరోసారి ఈ విషయాన్నీ ఖరారు చేసాడు కూడా. దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయి అట. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గా ఓటీటీ రైట్స్ ని తీసుకోబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఓజీ మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఓజీ 2 చిత్రానికి కచ్చితంగా క్రేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మొదటి భాగం కంటే అధికంగా మరో 50 కోట్ల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవచ్చు. అంటే 170 నుండి 180 కోట్లు అన్నమాట. ఇంత మొత్తాన్ని పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గా ఓజీ 2 కి అందుకోబోతున్నాడు.
‘ఓజీ 2’ చిత్రం సాధ్యమైనంత వరకు ప్రీక్వెల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముంబై వదిలి 15 ఏళ్ళు ఓజాస్ గంభీర అజ్ఞాత వాసం చేసాడు. ఈ 15 ఏళ్లలో ఆయన తన సొంత దేశమైనటువంటి జపాన్ కి వెళ్తాడు. అక్కడ ఓరొచ్చి గెలీషియాన్ గా ఎలా మారాడు, యాకూజా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడు, అక్కడి వాళ్లకు చనిపోయినట్టుగా నమ్మించి మళ్లీ ఇండియా కి ఎలా తిరిగివచ్చాడు,ఇక్కడ హీరోయిన్ ప్రియాంక మోహన్ తో పరిచయం, ప్రేమ ఎలా మొదలైంది? వంటి ప్రశ్నలకు సమాధానం గా ఈ ప్రీక్వెల్ ఉండబోతుంది. ఓజీ చిత్రం లో అసలు స్టోరీ నే లేదు అనే కంప్లైంట్ ఆడియన్స్ నుండి వచ్చింది. కానీ పార్ట్ 2 లో అందుకు తావు లేదు. బలమైన స్టోరీ,బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. వచ్చే ఏడాది నుండి షూటింగ్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి.