
నేడు(జూన్ 1) కరుణం మల్లీశ్వరి జన్మదినం. ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని మల్లీశ్వరీ బయోపిక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజైంది. తెలుగు తేజం కరుణ మల్లీశ్వరీ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఖాతాలో భారత్ కు తొలి పతకం అందించారు. పలు టోర్నోల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. తెలుగువారు గర్వించిన దగిన కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రపై సినిమాను తెరకెక్కించనున్నట్లు నిర్మాతలు ఎం.వీ.వీ.సత్యనారాయణ, కోన వెంకట్ సోమవారం ప్రకటించారు. ప్యాన్ ఇండియా స్థాయిలో మూవీ ఉండనుందని తెలిపారు. ‘JOURNEY OF A GIRL WHO LIFTED THE NATION’ PRODUTION NO.5 పేరిట చిత్రయూనిట్ కరుణం మల్లీశ్వరీకి బర్త్ డే విషెస్ చెబుతున్న పోస్టర్ రిలీజ్ చేశారు.
తెలుగు తేజం కరుణం మల్లీశ్వరీ బయోపిక్ మూవీ తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. చిత్రబృందం కరుణం మల్లీశ్వరీగా నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ మూవీలో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లిస్టులో ప్రియాంక చొప్రా, కంగనా రనౌత్ పేర్లు విన్పిస్తున్నాయి. ఈ పాత్రకు ప్రియాంక చొప్రా న్యాయం చేస్తుందనే టాక్ విన్పిస్తుంది. ఇప్పటికే ప్రియాంక చొప్రా బాక్సర్ మేరికోమ్ బయోపిక్ ‘మేరికోమ్’ మూవీలో నటించి మెప్పించింది. ఈ మూవీ కోసం ఆమె బాక్సింగ్ తోపాటు వెయిట్ లిప్టింగ్ కసరత్తులు చేశారు. దీంతో ఈ మూవీ కోసం ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ పేరు కూడా విన్పిస్తుంది. ఇప్పటికే ఆమెను సంప్రదించగా తాను ఇప్పట్లో వర్కౌట్స్ చేయలేనని తేల్చి చెప్పిందట. కంగనా ఇటీవల ‘పంగా’ మూవీలో రెజ్లర్ గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో నిర్మాతలు ప్రియాంక చొప్రానే తీసుకోవాలని భావిస్తున్నారట. ఈమూవీకి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తియినట్లు సమాచారం. లాక్డౌన్ అనంతరం ఈ మూవీని పట్టాలెక్కించేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. అయితే కరుణం మల్లీశ్వరీగా ప్రియాంక చోప్రా నటిస్తారా? లేదా ఇంకేవరైనా ఆ ప్లేస్ ను భర్తీ చేస్తారా? అనేది త్వరలోనే తేలనుంది. అంతవరకు వేచి చూడాల్సిందే..!