https://oktelugu.com/

Karate Kalyani: ఎన్టీఆర్ దేవుడైతే నేను దేవత… కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు, రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్!

తాజాగా ఈ వివాదంపై మరికొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి. ఎన్టీఆర్ ఎలా దేవుడు? ఏ వర్గానికి దేవుడు? ఎవరి కోసం దేవుణ్ణి చేస్తున్నారు? మనిషికి దేవుడికి తేడా ఉంది. కొందరిని మెప్పించడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని కరాటే కళ్యాణి అన్నారు. శ్రీకృష్ణుడు వేషం వేసిన ఎన్టీఆర్ దేవుడు అయితే... నేను అమ్మోరు వేషం వేస్తాను. నేను కూడా దేవత అవుతాను.

Written By: , Updated On : May 20, 2023 / 02:25 PM IST
Karate Kalyani

Karate Kalyani

Follow us on

Karate Kalyani: ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ విగ్ర ఏర్పాటు వివాదాస్పదమైంది. శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహాన్ని లకారం ట్యాంక్ బండ్ పై మే 28న ఆవిష్కరించాల్సి ఉంది. దీన్ని యాదవ సామాజిక వర్గం తప్పుబడుతుంది. నటి కరాటే కళ్యాణి తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు పై స్టే విధించింది. కోర్టు తీర్పుపై కరాటే కళ్యాణి హర్షం వ్యక్తం చేశారు. దేవుడున్నాడు, అందుకే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని కరాటే కళ్యాణి అభిప్రాయపడ్డారు.

తాజాగా ఈ వివాదంపై మరికొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి. ఎన్టీఆర్ ఎలా దేవుడు? ఏ వర్గానికి దేవుడు? ఎవరి కోసం దేవుణ్ణి చేస్తున్నారు? మనిషికి దేవుడికి తేడా ఉంది. కొందరిని మెప్పించడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని కరాటే కళ్యాణి అన్నారు. శ్రీకృష్ణుడు వేషం వేసిన ఎన్టీఆర్ దేవుడు అయితే… నేను అమ్మోరు వేషం వేస్తాను. నేను కూడా దేవత అవుతాను.

మనుషులు దేవుళ్ళు కాలేరు. దేవుళ్ళు మనుషులు ఒకటి కాదు. అలా అయితే మనం దేవుళ్ళ ఫోటోలకు ఎందుకు ఫూజలు చేయాలి. మన ఫోటోలకు మనమే పూజలు చేసుకుంటే సరిపోతుంది కదా… అన్నారు. ఎన్టీఆర్ మీద నాకు గౌరవం ఉంది. ఆయన్ని నేను పూజిస్తాను. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించడాన్నే తప్పుబట్టాను… అని కరాటే కళ్యాణి అన్నారు.

ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాను వ్యతిరేకించిన కారణంగా కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు నోటీసులు జారీ చేశారు. మంచు విష్ణు చర్యపై కరాటే కళ్యాణి సీరియస్ అయ్యారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కోర్టు మీద కూడా మంచు విష్ణు చర్యలు తీసుకోవాలని ఎద్దేవా చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్టీఆర్ చేతిలో ఉన్న పిల్లనగ్రోవి,తలపై నెమలి పింఛం తొలగించి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట.