Actress Hema : నటి హేమ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం సంచలనం సృష్టించింది. బెంగుళూరులో జరిగిన పార్టీకి వెళ్లి అడ్డంగా బుక్కైన హేమ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను రిమాండ్ కి తరలించారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చింది. బెంగళూరులోని శివారులో ఓ వ్యక్తి బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేశారు. దాదాపు 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రైడ్ లో టాలీవుడ్ నటి హేమ పట్టుబడటం హాట్ టాపిక్ అయింది. ఆమె డ్రగ్స్ తీసుకుందని నిర్ధారించిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపారు. పలుమార్లు నోటీసులు పంపినా ఆమె విచారణకు రాకపోవడంతో పోలీసులు హేమను అరెస్ట్ చేశారు.
ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం రిమాండ్ కి తరలించారు. కొంతకాలం మీడియాకి ముఖం చాటేసిన హేమ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తాను ఏ తప్పూ చేయలేదని. నిజానిజాలు త్వరలో కోర్ట్ లో రుజువవుతాయి. అప్పుడు తానేంటో అందరికి తెలిసి వస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. సదరు వీడియోలో రేవ్ పార్టీ విషయమై ఆమె కీలక విషయాలు వెల్లడించారు.
హేమ మాట్లాడుతూ .. గత కొద్ది నెలలుగా మీడియాలో నాపై అనేక పుకార్లు వచ్చాయి. చేయని తప్పుకి నాపై నిరాధారమైన కథనాలు రాశారు. నేను అన్నీ టెస్టులు చేయించుకున్నాను. రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసమే ఈ వీడియో చేశాను అని, హేమ చెప్పుకొచ్చింది. ఆమె చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ ఈ వీడియోలో షేర్ చేసింది.
ఈ వివాదాన్ని పరిశీలిస్తే… మే 19-20 తేదీల్లో బెంగుళూరు శివారులో గల ఓ ఫార్మ్ హౌస్ బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నిషేదిత డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం పై బెంగళూరు పోలీసులు దాడులు చేశారు. అక్కడ కొకైన్ తో పాటు మరికొన్ని రకాల డ్రగ్స్ గుర్తించారు. అనంతరం 80 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి హేమ సైతం ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బెంగుళూరు పోలీసులు ప్రకటన చేశారు. కన్నడ మీడియాలో నటి హేమ రేవ్ పార్టీలో పట్టుబడినట్లు కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలను ఖండిస్తూ హేమ ఓ వీడియో విడుదల చేసింది. తాను బెంగుళూరు వెళ్ళలేదు. హైదరాబాద్ లోనే ఉన్నాను. రేవ్ పార్టీలో నేను పాల్గొన్నానంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని హేమ వివరణ ఇచ్చారు. అయితే హేమను విచారించిన బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఆమె బెయిల్ పై విడుదలైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. తాజాగా నేను ఏ పాపం చేయలేదు. మీడియా నన్ను చెడుగా చిత్రీకరించింది అంటుంది. హేమ తప్పు చేయకపోతే పోలీసులు అరెస్ట్ ఎందుకు చేశారనేది అందరి ప్రశ్న..
Web Title: Bangalore rave party case actress hema wants to meet pawan kalyan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com