https://oktelugu.com/

బిగ్‌బాస్-4: కరాటే కల్యాణ్ ఔట్.. రెండో ఎలిమినేటర్ ఎవరంటే?

తెలుగు రియల్టీ షోలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ కొనసాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ నడుస్తోంది. గతంలో వచ్చిన బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3 సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో బిగ్ బాస్ షో ఉంటుందా? ఉండదా? అనే అనుమానాల మధ్యనే బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. తొలిరోజు నుంచే బిగ్ బాస్-4పై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. Also Read: 70 కోట్లుకు తక్కువైతే సినిమా చేయడట ! […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2020 / 11:00 AM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ కొనసాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ నడుస్తోంది. గతంలో వచ్చిన బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3 సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో బిగ్ బాస్ షో ఉంటుందా? ఉండదా? అనే అనుమానాల మధ్యనే బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. తొలిరోజు నుంచే బిగ్ బాస్-4పై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది.

    Also Read: 70 కోట్లుకు తక్కువైతే సినిమా చేయడట !

    బిగ్ బాస్-4లో పెద్దగా సెలబెట్రీలెవరూ లేకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో షోపై భారీ అంచనాలు పెట్టుకున్న బుల్లితెర ప్రేక్షకులు మాత్రం నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ రెండోవారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలో తొలి ఎలిమినేటర్ గా దర్శకుడు సూర్యకిరణ్ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చారు.

    ఇక రెండోవారంలో బిగ్ బాస్ సడెన్ ట్వీస్ట్ ఇచ్చాడు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. బిగ్ బాస్ చెప్పినట్లుగా శనివారం కరాటే కల్యాణి ఎలిమినేషన్ అయింది. ఇక నేడు మరొకరిని బిగ్ బాస్ ఎలిమినేషన్ చేయనుండటంతో కంటెస్టుల్లో ఆందోళన మొదలైంది. ఈ వారం నామినేషన్స్ తో తొమ్మిది మంది కంటెస్టులు ఉండగా బిగ్ బాస్ గంగవ్వను సేఫ్ చేశాడు. దీంతో ఎనిమిది మంది ఎలిమినేషన్లో ఉన్నట్లు హోస్టు నాగార్జున ప్రకటించారు.

    Also Read: ఔరా.. అనిపిస్తున్న ‘బిగ్ బాస్’ పేమెంట్లు..!

    వీరిలో నుంచి కరాటే కల్యాణిని బిగ్ బాస్ శనివారం ఎలిమినేట్ చేశారు. దర్శకుడు సూర్యకిరణ్ తర్వాత రెండో ఎలిమినేటర్ గా కరాటే కల్యాణ్ బిగ్ హౌజ్ నుంచి బయటికి వెళ్లింది. ఇక ఆదివారం రోజు ఆమె బిగ్ హౌజ్ లోని సభ్యుల గురించి.. తాను ఎలిమినేట్ అవడానికి గల కారణాలను బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పబోతుంది. ఇక ఆదివారం కూడా బిగ్ బాస్ ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. దీంతో ఆ కంటెస్టెంట్ ఎవరై ఉంటారనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే..!