Karan Johar and Ram Charan : బాలీవుడ్ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించిన వ్యక్తి కరణ్ జోహార్(Karan Johar). ఈయన ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే కచ్చితంగా అది సూపర్ హిట్ అని అక్కడి ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మన బాహుబలి సిరీస్ బాలీవుడ్ లో ఆ స్థాయి ప్రభంజనం సృష్టించడానికి మూలకారణం కరణ్ జోహార్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనీవినీ ఎరుగని రేంజ్ రిలీజ్ ని ఆ చిత్రానికి ఇచ్చి, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ అయ్యేలా చేసాడు. చాలా కాలం నుండి ఆయన ద్రుష్టి బాలీవుడ్ హీరోల నుండి టాలీవుడ్ హీరోలకు మరలింది. ఎందుకంటే బాలీవుడ్ హీరోల క్రేజ్ బాగా తగ్గిపోయిందని కరణ్ జోహార్ అభిప్రాయం. అక్కడి హీరోలతో చేస్తే కేవలం నార్త్ వరకే వసూళ్లు వస్తున్నాయి, సౌత్ లో అసలు రావడం లేదు.
అదే టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తే సౌత్, నార్త్ ఓవర్సీస్ అన్ని కలిసొస్తాయి.అందుకే కరణ్ జోహార్ ద్రుష్టి మన టాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమాలవైపుకి మరలింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేతులు కలపబోతున్నాడని సమాచారం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాల భారీ డీల్ వీళ్లిద్దరి మధ్య కుదిరిందని బాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. అందులో ఒకటి ‘కిల్’ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో ఉండబోతుందని సమాచారం. ముందుగా ఈ ప్రాజెక్ట్ ని విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో చేయాలనే ప్లాన్ ఉండేదట. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు రామ్ చరణ్(Global Star Ram Charan) కి షిఫ్ట్ అయ్యింది. ఈ ఏడాది లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయట. మరో రెండు సినిమాలు కూడా క్రేజీ డైరెక్టర్స్ ని కరణ్ జోహార్ రామ్ చరణ్ కోసం ప్లాన్ చేసినట్టు సమాచారం.
Also Read : షాకింగ్: చిరంజీవి, రాంచరణ్ పొలిటికల్ ఎంట్రీ..!! వేర్వేరు పార్టీల లీడర్లుగా..
రామ్ చరణ్ కి మొదటి నుండి బాలీవుడ్ మంచి క్రేజ్ ఉంది. ‘మగధీర’ చిత్రం ఆయనకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గురింపుని తెచ్చిపెట్టింది. ఆ గుర్తింపుతోనే అప్పట్లో ‘జంజీర్’ చిత్రాన్ని రీమేక్ చేస్తూ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత టీవీ టెలికాస్ట్ ద్వారా రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇక #RRR తో అయితే ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రీసెంట్ గా విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీ వెర్షన్ లో 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇదంతా చూస్తూనేట్ రామ్ చరణ్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది, కానీ సరైన సినిమా పడాలి అన్నట్టుగా అనిపిస్తుంది. కరణ్ జోహార్ తో సెట్ చేసుకున్న ఈ మూడు సినిమాలు ఆయన్ని బాలీవుడ్ ఆడియన్స్ కి మరింత చేరువ చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : ‘ఆర్ఆర్ఆర్’ వచ్చాక ఓ 4 నెలలు ఏ సినిమా విడుదల చేయకుంటే బెటర్- సల్మాన్