Good Bad Ugly Trailer: సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమా తీయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం అవ్వదు ఎందుకంటే ఒక సినిమాని తీయాలంటే ఆ దర్శకుడికి అన్ని క్రాఫ్ట్ ల మీద అవగాహన ఉండాలి అంతకుమించిన పరిజ్ఞానం అవసరం పడుతుంది. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న కాంటెంపరరీ ఇష్యూస్ ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటి మీద అవగాహన ఉన్నప్పుడే దర్శకుడు సినిమాను తీసి స్టార్ డైరక్టర్ గా మారగలుగుతాడు. ఇక ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో అయిన అజిత్ హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా వస్తుంది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం…ఈ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యం లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లైతే అజిత్ ఒకప్పటి గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తీసిన సినిమాలను గుర్తు చేశారా? భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అజిత్ ఇందులో రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు అనేది ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఒకప్పటి అజిత్ డైలాగులను అతని మ్యానరిజమ్స్ ని వాడుకొని సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం అయితే చేశారు. ఈ మధ్యకాలంలో అజిత్ ఇంత జోష్ ఫుల్ గా ఉండే సినిమానైతే చేయలేదు. ఇక సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో అజిత్ తన కొడుకుకి ఏదైనా అపద వస్తుందేమో అనుకోని గన్ వదిలేశాడు.
Also Read: పెద్ది vs ప్యారడైజ్ పోటీ లో గెలిచేది ఎవరు..?
కానీ తన కొడుకుకి అపద రావడం తో మరోసారి గన్ పట్టాల్సి వచ్చిందనే విషయాన్ని తెలియజేశారు. మరి ఈ సినిమాలో అర్జున్ దాస్ విలన్ పాత్ర ను పోషించినట్టుగా కూడా అర్థమవుతుంది. మరి ఆయన చేసినటువంటి పాత్రకి కొద్దిగా న్యాయం చేసినట్టుగా కనిపిస్తున్నాడు. ఇక అజిత్ లాంటి స్టార్ హీరోని ఎదుర్కోడానికి అర్జున్ దాస్ లాంటి విలన్ ను పెట్టడం అనేది కొంతవరకు మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
అర్జున్ దాస్ వాయిస్ లో బేసి ఉంటుంది. కానీ స్టార్ హీరో ను ఎదిరించడానికి మెయిన్ విలన్ గా రాణించే కెపాసిటీ గాని ఆయన కటౌట్ గాని సెట్ అవ్వదనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు అర్జున్ దాస్ చేసిన పాత్రలు మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి మెయిన్ విలన్ గా ఆయన ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించలేదు. ఒక స్టార్ హీరో సినిమాలో అతన్ని విలన్ గా తీసుకోవడం అనేది కొంతవరకు మైనస్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సినిమాలో త్రిష కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుంది.
ఇక సిమ్రాన్ పాత్ర గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించబోతుందన్న విషయాన్ని అయితే ట్రైలర్ లో క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఈ సినిమా ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ విజయాన్ని అందుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…