Ajith : హీరోలను అభిమానించడం, ఆరాధించడం లో ఎలాంటి తప్పు లేదు. వారిలోని మంచి గుణాలను తీసుకొని సమాజానికి ఉపయోగపడేలా ఉంటే ఎంతో బాగుంటుంది. కానీ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుంది కదా అని, హంగులు, ఆర్భాటాలకు వెళ్లి కొంతమంది ప్రాణాపాయ పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారు. రీసెంట్ గా అలాంటి ఘటన చెన్నై లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం విడుదలకు ముందు అభిమానులు కాకినాడ 256 అడుగుల ఎత్తు ఉన్న భారీ కటౌట్ ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డుని క్రియేట్ చేసారు. ఈ రికార్డు ని ఎలా అయినా కొట్టాలని ఫిక్స్ అయ్యారు తమిళ స్టార్ హీరో అజిత్(Thala Ajith) ఫ్యాన్స్. మరో మూడు రోజుల్లో ఆయన హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) చిత్రం విడుదల కాబోతుంది.
Also Read : వెయ్యి కోట్ల సినిమా నిర్మాత ఇలా అయిపోయాడేంటి..! ఎవరో గుర్తుపట్టారా?
ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని తెంకాసి పట్టణం లో ఉండే ఒక టాప్ థియేటర్ లో 285 అడుగుల ఎత్తులో ఒక భారీ కటౌట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు. అందుకోసం ఇనుముతో తయారు చేసిన ఫెన్సింగ్ గ్రిల్స్ ని ఏర్పాటు చేసి, వాటి సహాయం తో కటౌట్స్ భాగాలను ఒక్కొక్కటిగా అమర్చడానికి ప్రయత్నం చేసారు. తల భాగాన్ని విజయవంతంగా పూర్తి చేసారు, కానీ కాసేపటికే అది కుప్పకూలిపోయింది. ఇనప ఫెన్సింగ్ గ్రిల్స్ కిందకు పడిపోతున్న విషయాన్ని గమనించిన జనాలు వెంటనే అప్రమత్తమై అక్కడి నుండి తప్పించుకున్నారు. ఈ కటౌట్ కింద అభిమానులు ఎవరిపైన ఉండుంటే ప్రాణాలు పోయేవి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ విజువల్స్ ని చూస్తే వణుకు పుట్టే రేంజ్ లో ఉన్నాయి. దేవుడి కృప కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడేవో.
ఇకపోతే అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంపై తమిళనాడు ప్రాంతంలో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ‘పుష్ప 2’ తో దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్స్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య కాలం లో విడుదలైన అజిత్ సినిమాలన్నిట్లో ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూసేలా చేసిన చిత్రమిదే. రీసెంట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వగా, అప్పుడే తమిళనాడు ప్రాంతం నుండి 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు దాటాయి. కచ్చితంగా తమిళనాడులో ఈ చిత్రం మొదటి రోజున ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి వాళ్ళ అంచనాలకు తగ్గ ఓపెనింగ్స్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
Also Read : గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ లో ఈ ఒక్కటి గమనించారా..?
Namaku yethuku intha vela!!♂️
— Christopher Kanagaraj (@Chrissuccess) April 6, 2025