Kapil Sharma: ప్రస్తుతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సినిమాలే కాకుండా ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ‘గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ షో కోసం ‘కపిల్ శర్మ’ దాదాపు ఒక ఎపిసోడ్ కు 5 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక కపిల్ శర్మ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ఆయనకి అన్ని కోట్లు పెట్టి మరి ఆయనతో ఆ షో చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.
నిజానికి ఓటిటి ప్లాట్ ఫామ్ రావడం వల్ల ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ చాలా రకాలుగా దొరుకుతుందనే చెప్పాలి. ఒకప్పుడు సినిమాల ద్వారానే ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది. ఆ తర్వాత సీరియల్స్ ని బేస్ చేసుకొని ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యారు. ఇక ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా వివిధ రకాల షోలు కూడా వచ్చి వాళ్లను తరచుగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి.
ఇక మొత్తానికైతే ప్రేక్షకుడి యొక్క అభిరుచిని బట్టి మేకర్స్ కూడా డిఫరెంట్ గేమ్ షో స్ ని ప్లాన్ చేస్తున్నారు…ఇక ఈ షోలో ఆడియన్స్ లో కూర్చొని నవ్వడం కోసం నటి అర్చన సింగ్ ఒక్క ఎపిసోడ్ కోసం 10 లక్షల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటుంది… ఇక మొత్తానికైతే కపిల్ శర్మ ఒక అద్భుతమైన షో ని రన్ చేస్తూ భారీ మొత్తంలో డబ్బులను సంపాదిస్తున్నాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం సినిమాలతో పోటీపడి మరి షోలు సక్సెస్ అవుతున్నాయి.
కాబట్టి సినిమా హీరోలకి ఏమాత్రం తీసుకోకుండా షోలు చేస్తున్న హోస్ట్ లు కూడా అద్భుతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు. ఇక షో లు చేసిన చాలా మంది ప్రస్తుతం హీరోలుగా కూడా మారి వెండి తెర పైన వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో షో లకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక ఫ్యూచర్లో మరికొన్ని షోస్ కూడా వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి…