spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: పుష్ప 2లో ఈ షూ స్లిప్పింగ్ స్టెప్ కంపోజ్ చేసిన మాస్టర్ ఎవరో...

Pushpa 2: పుష్ప 2లో ఈ షూ స్లిప్పింగ్ స్టెప్ కంపోజ్ చేసిన మాస్టర్ ఎవరో తెలుసా? అతడు లేటెస్ట్ సెన్సేషన్!

Pushpa 2: పుష్ప 2 పై అంతకంతకు హైప్ పెరుగుతూ పోతుంది. నిన్న విడుదలైన ‘పుష్ప పుష్ప’ సాంగ్ సైతం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విశేష ఆదరణ దక్కించుకుంటుంది. పుష్ప సాంగ్ లోని ఓ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షూ స్లిప్పింగ్ స్టెప్ అనుకరిస్తూ పలువురు వీడియోలు చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1లో దేవిశ్రీ స్వరపరిచిన ‘శ్రీవల్లి’ సాంగ్ ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సదరు సాంగ్ లో అల్లు అర్జున్ ఓ స్టెప్ వేస్తూ కాలికి ఉన్న చెప్పు జారవిడుస్తాడు. అదే తరహా స్టెప్ పుష్ప 2 సాంగ్ లో కూడా అల్లు అర్జున్ ట్రై చేశాడు.

ఒక కాలికి ఉన్న షూ జారవిడిచి ఒంటి కాలిపై డాన్స్ చేస్తూ… మరలా షూని ధరించి స్టెప్ వేస్తాడు. ‘పుష్ప పుష్ప’ సాంగ్ లోని ఈ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతి తక్కువ సమయంలో ఆదరణ దక్కించుకున్న ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ ఎవరు అందించారనే చర్చ మొదలైంది. కాగా పుష్ప 2 చిత్రంలోని సాంగ్స్ కి ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, విజయ్ పోలాకి, శ్రేష్టి వర్మలు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ‘పుష్ప పుష్ప’ సాంగ్ ని విజయ్ పోలాకి కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది.

ఇటీవల గొప్ప విజయాలు సాధించిన బేబీ, హాయ్ నాన్న, మ్యాడ్ చిత్రాలకు ఆయన పని చేశారు. అలాగే బబుల్ గమ్, భాగ్ సాలే చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు. ‘పుష్ప పుష్ప’ సాంగ్ సక్సెస్ నేపథ్యంలో విజయ్ పోలాకికి ఆఫర్స్ పెరిగే అవకాశం కలదు. పుష్ప చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్… పుష్ప 2కి సైతం మ్యూజిక్ దర్శకుడిగా పని చేస్తున్నాడు. పుష్ప పుష్ప సాంగ్ కి ఆయన ఇచ్చిన స్వరాలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ బీట్ తో సాగాయి.

చంద్రబోస్ సాహిత్యం అందించారు. పుష్ప 2 వరల్డ్ వైడ్ ఆరు భాషల్లో ఆగస్టు 15న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక రోల్స్ చేస్తున్నారు. పుష్ప 2 రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఈసారి పుష్ప రూ. 1000 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు.

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version