83 MOvie: 1983 క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా విజయ సాధించిన తర్వాత.. అందరి చెవుల్లో రెండు పేర్లు వినిపించాయి.. ఒకటి ఇండియా రెండు కపిల్ దేవ్. ఆయన కెప్టన్సీలోనే భారత్ తొలిసారి వరల్డ్ కప్ సాధించింది. ఆయన విజయగాథకు గుర్తుగా బాలీవుడ్లో 83 పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనె నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం. ఈ సినిమా కోసం కపిల్ దేవ్ అండ్ టీమ్ ఎంత డిమాండ్ చేశారో తెలిసింది. రైట్స్ లోభాగంగా ఆ టీమ్ ఇండియా ఆటగాళ్లకు సుమారు రూ.15 కోట్లు ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అందులో ఎక్కువగా కపిల్కే దక్కిందట. ఆయన ఏకంగా రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. మిగిలిన ఆటగాళ్లంతా ఒక్కో రూ.కోటి తీసుకున్నట్లు సమాచారం.
కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైరల్కు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో సినిమాపై బారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. తమిళ నటుడు జీవా కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. దీపికా పదుకొనే, కిచ్చా సుదీప్, జీవా, పంకజ్ త్రిపాఠి, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం హిందీలోనే కాదు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నారు.