https://oktelugu.com/

Kamal Haasan: మళ్ళీ విక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొన్న లోక నాయకుడు కమల్ హాసన్…

Kamal Haasan: విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతమంది ప్రేక్షకులచే నట విశ్వరూప్ అనే బిరుదు అందుకున్నారు కమల్ హాసన్.తమిళ, తెలుగు భాషలలో ఎంతో మంది ప్రేక్షకుల హృదయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. తమిళ స్టార్ హీరో కమల్హాసన్కు ఇటీవలే కరోనా సోకిన సంగతి తెలిసిందే. మ‌హ‌మ్మారి క‌రోనా నుండి కోలుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్ లో బిజీ అయ్యారు.శంకర్ దర్శకత్వంలో ఇండియా 2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా సగభాగం […]

Written By: , Updated On : December 23, 2021 / 02:47 PM IST
kamal haasan joined in vikram movie shooting after cured from corona
Follow us on

Kamal Haasan: విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతమంది ప్రేక్షకులచే నట విశ్వరూప్ అనే బిరుదు అందుకున్నారు కమల్ హాసన్.తమిళ, తెలుగు భాషలలో ఎంతో మంది ప్రేక్షకుల హృదయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. తమిళ స్టార్ హీరో కమల్హాసన్కు ఇటీవలే కరోనా సోకిన సంగతి తెలిసిందే. మ‌హ‌మ్మారి క‌రోనా నుండి కోలుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్ లో బిజీ అయ్యారు.శంకర్ దర్శకత్వంలో ఇండియా 2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా సగభాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.అలానే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ” విక్రమ్‌” సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాకి రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు.అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టారు లోకనాయకుడు.

kamal haasan joined in vikram movie shooting after cured from corona

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా విజయ్ సేతుపతి, మలయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్,అర్జున్ దాస్,ఆండ్రియా జెరెమియా ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం “విక్రమ్‌”. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం విక్రమ్‌’. చిత్రీకరణ తుదిదశకొచ్చినట్టు యూనిట్‌ బుధవారం తెలిపింది. డిసెంబరు 10 నుంచి మొదలైన ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. కరోనా నుంచి కోలుకున్నాక కమల్‌హాసన్‌ బుధవారం తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 31న విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమాతో మునుపటి వైభోగాన్ని లోకనాయకుడు అందుకుంటాడో లేదో చూడాలి అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.