https://oktelugu.com/

Natural Star Nani: ఆ సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయాలని ఉందంటున్న నాని… ఎవరంటే

Natural Star Nani: సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేయాలనుంది అంటున్నారు నాచురల్ స్టార్ నాని.నాచురల్ స్టార్ నాని హీరోగా పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటించిన కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 24న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 23, 2021 / 02:31 PM IST
    Follow us on

    Natural Star Nani: సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేయాలనుంది అంటున్నారు నాచురల్ స్టార్ నాని.నాచురల్ స్టార్ నాని హీరోగా పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటించిన కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా భారీ అంచనాలతో ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. తెలుగుతోపాటు పలు భాషల్లో కూడా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.ఈ సందర్భంగా కోలీవుడ్‌లో ప్రమోషన్స్ నిర్వహించారు యూనిట్ బృందం.


    ఈ ప్రమోషన్స్ భాగంగా నాని మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయాలనుంది అని చెప్పుకొచ్చారు. హీరో నాని తలైవా కు వీరాభిమాని ఆయన నటించిన సినిమాలలో (పడయప్పా) “నరసింహా” అంటే చాలా ఇష్టమని చెప్పారు నాని.అలానే నరసింహా, శివాజీ చిత్రాలో రజనీ చెప్పిన డైలాగ్స్‌తో అలరించాడు. ఇక నాని లెజండరీ డైరెక్టర్ మణిరత్నం వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. అదృష్టం కలిసొచ్చి హీరో అయ్యాడు లేదంటే స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగే వారు నాని.ఇప్పటికే పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నాని అన్ని బాగుంటే ఫ్యూచర్ లో కూడా డైరెక్టర్ అయ్యే అవకాశం కూడా ఉండక పోదు.