Kantara Collections: ఈ ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకి గోల్డెన్ ఇయర్ లాంటిది అని చెప్పొచ్చు..కన్నడ సినిమా వాళ్లకి ఇంత ప్రతిభ ఉందా అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయ్యేంతలా చేసిన ఏడాది ఇది..ముందుగా KGF చాప్టర్ 1 కన్నడ సినీ పరిశ్రమ వైపు అందరూ చూసేలా చేసింది..ఇక ఆ తర్వాత వచ్చిన KGF చాప్టర్ 2 వసూళ్లు ఏకంగా రాజమౌళి తెరకెక్కించిన #RRR మూవీ రికార్డ్స్ నే బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 ఇండియన్ గ్రాస్సర్ గా నిలిచింది..ఇప్పుడు ‘కాంతారా’ సినిమా కూడా అదే స్థాయి ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలైన కాంతారా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలే సృష్టించింది.

కేవలం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతో ప్రారంభమైన ఈ చిత్రం,ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది..ఇటీవలే ఈ సినిమాని తెలుగు , తమిళం మరియు హిందీ బాషలలో కూడా విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.
ఆ బాషలలో కూడా ఈ చిత్రం రికార్డు స్థాయి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది..ఇక ఈ చిత్రం కన్నడ సినిమాలలో సరికొత్త చరిత్ర సృష్టించింది..కన్నడ చలన చిత్ర చరిత్రలో ఇప్పటి వరుకు విడుదలైన సినిమాలలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా కాంతారా సరికొత్త రికార్డుని నెలకొల్పింది..సుమారు 80 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట ఈ సినిమాకి..ఇంతకు ముందు విడుదలైన KGF చాప్టర్ 2 కి 73 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయట..అంతకుముందు KGF చాప్టర్ 1 కి 77 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోగా, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరో గా నటించిన ‘రాజకుమార’ చిత్రానికి 65 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
ఇప్పుడు కాంతారా చిత్రం ఈ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 1 చిత్రం గా నిలిచి చరిత్ర సృష్టించింది..చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం నేడు అనితర సాధ్యమైన రికార్డ్స్ ని పెట్టడం చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు.