Sleep Tips: కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర లేకపోతే ఆరోగ్యం మందగిస్తుంది. మన జీవితంలో సగ భాగం నిద్ర కోసమే గడిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. నిద్రకున్న ప్రాధాన్యత అలాంటిది. కంటి నిండా నిద్ర పోతే మనకు రోగాలు కూడా రావు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది నిద్ర రాక ఇబ్బందులు పడుతున్నారు. నిద్ర పోవడానికి కూడా కొన్ని టెక్నిక్ లు ఉన్న సంగతి తెలిసిందే. అవి పాటిస్తే సరిపోతుంది. హాయిగా నిద్రపోతే ఎలాంటి సమస్యలు రావు. నిద్ర పోకపోతే మనం రోగాలకు దగ్గరవుతున్నట్లే.

ప్రతి వారిలో మెలటోనిన్ హార్మోన్ ఉంటుంది. ఇది మన చుట్టు చీకటి ఉన్నప్పుడు మరింత పెరుగుతుంది. దీంతో నిద్ర హాయిగా పడుతుంది. చీకటికి స్పందనగా మెదడులోని పీనియల్ గ్రంథి దీన్ని విడుదల చేస్తుంది. అందుకే మెలటోనిన్ హార్మోన్ తో నాడీ సంబంధ క్రియలు మందగిస్తాయి. మన శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. ఫలితంగా నిద్రలోకి జారుకుంటాం. మెలటోనిన్ విడుదలతో గాఢ నిద్ర పడుతుంది. మెలటోనిన్ హార్మోన్ విడుదల సక్రమంగా ఉంటే మనకు మంచి నిద్ర పట్టడం ఖాయమే.
సాయంత్రం పూట కాఫీ, టీలకు టాటా చెప్పేయడం మంచిది. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల మెదడులో విశ్రాంతి ఉండదు. దీంతో నిద్ర రాకుండా పోతోంది. రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ తాగితే నష్టమే. దీంతో నిద్ర రావడం గగనమవుతుంది. నిద్రను దూరం చేసే సాధనాల్లో మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ లు ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. కనీసం రెండు మూడు గంటల ముందు వీటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ప్రశాంతంగా ఉంటేనే మంచి నిద్ర సాధ్యమవుతుంది. ఒత్తిడిని దూరం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

నిద్ర లేమి సమస్య తో బాధ పడే వారు ఈ జాగ్రత్తలు తీసుకుని నిద్ర పోయేందుకు సహకరించే పరిస్థితులను కల్పించుకోవాలి. అవకాడో, గుమ్మడిగింజలు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. మాంసాహారాలు కూడా మనకు నష్టం కలిగిస్తాయి. దీంతో సురక్షితంగా నిద్ర పోయేందుకు వీలు కల్పించుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మన నిద్ర లేమి సమస్య పెరిగితే మనకు నష్టమే ఎక్కువ కానుంది. అందుకే నిద్రకు ప్రాధాన్యం ఇచ్చి నిద్ర పోయేందుకు అవసరమయ్యే చర్యలు తీసుకుంటే మంచిది.