Kantara Chapter 1 Collections: భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా విడుదలైన ‘కాంతారా : ది చాప్టర్ 1′(Kanthara : Chapter 1) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాంతారా లాంటి సూపర్ హిట్ పాన్ ఇండియన్ సినిమాకు ప్రీక్వెల్ కావడంతో ఈ చిత్రం పై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉండేవి. కానీ మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. థియేట్రికల్ ట్రైలర్ కూడా యావరేజ్ గా అనిపించింది. అయినప్పటికీ కూడా ప్రీక్వెల్ కావడంతో డైరెక్టర్/ హీరో రిషబ్ శెట్టి కచ్చితంగా ఇరగకుమ్మేసి ఉంటాడనే బలమైన నమ్మకం ఉండేది ఆడియన్స్ లో. అందుకే ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ ఇచ్చారు. కానీ ఈ ఓపెనింగ్ వసూళ్లు, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సరిపడినది కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకో వివరంగా చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు అన్ని భాషలకు కలిపి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించిన ఒక సినిమా సీక్వెల్ కి ఇది తక్కువ ఓపెనింగ్ అనే చెప్పాలి. కనీసం 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని ఆశించారు. కానీ అది జరగలేదు. ఓవర్సీస్ అయితే దారుణం అనే చెప్పాలి. ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రం 9 మిలియన్ డాలర్లకు పైగా అమ్ముడుపోయింది. కానీ ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 7 లక్షల డాలర్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సాధారణంగా పాన్ ఇండియా లెవెల్ హైప్ తో వచ్చే సినిమాలకు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు వస్తుంటాయి, ఈ సినిమాకు అక్కడే పెద్ద దెబ్బ తగిలింది. కానీ వచ్చిన కలెక్షన్స్ మొత్తం కన్నడ మరియు తెలుగు వెర్షన్ లోనే ఎక్కువ భాగం ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి రోజున 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక్క నైజాం ప్రాంతం లోనే నాలుగు కోట్ల 50 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చింది. ఓవరాల్ గా మొదటి రోజు ఆంధ్ర, తెలంగాణ కలిపి 11 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. కానీ ఇది బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు సరిపడా ఓపెనింగ్ కాదు. ఎందుకంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి దాదాపుగా 90 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. చూస్తుంటే భారీ నష్టాలను మిగిలించే దిశగా ఈ చిత్రం అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. చూడాలి మరి లాంగ్ రన్ ఉంటుందో లేదో అనేది.