Kantara Chapter 1 Collection Day 20: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఆడియన్స్ అంచనాలను అందుకోవడం సక్సెస్ అయిన సినిమాల్లో ఒకటి ‘కాంతారా : ది చాప్టర్ 1′(Kantara : The Chapter 1). పాన్ ఇండియా లెవెల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ‘కాంతారా’ చిత్రానికి ఇది ప్రీక్వెల్. మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ చిత్రానికి భీభత్సమైన పాజిటివ్ టాక్ వచ్చింది. కనీసం ఒక్కరు కూడా సోషల్ మీడియా లో నెగిటివ్ టాక్ చెప్పలేదు. టాక్ అయితే వచ్చింది కానీ, ఆ టాక్ కి తగ్గ వసూళ్లు మాత్రం ఈ చిత్రానికి రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి క్రేజ్ ఉన్న సీక్వెల్ బ్రాండ్ సినిమాలకు ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు కచ్చితంగా రావాలి. కానీ ఈ చిత్రం 20 రోజులకు కలిపి 752 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఫుల్ రన్ లో 800 నుండి 820 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
ప్రాంతాలవారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక ప్రాంతం లో ఈ చిత్రం ఏకంగా 213 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే 20 రోజులకు 102 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా తమిళనాడు లో 60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళలో 52 కోట్ల రూపాయిలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 215 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే దాదాపుగా 109 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఈ వారం తో థియేట్రికల్ రన్ ముగిసింది అని అనుకోవచ్చు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 752 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 366 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. 91 కోట్ల రూపాయలకు ఈ సినిమాను కొనుగోలు చేశారు. 20 రోజుల్లో 64 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 26 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. కానీ అది అసాధ్యం అనే చెప్పాలి. ఓవరాల్ గా తెలుగు వెర్షన్ వసూళ్లు బయ్యర్స్ ని తీవ్రమైన నిరాశకు గురి చేశాయి. బ్లాక్ బస్టర్ టాక్ తో ఇంత నష్టాలు వస్తాయని ట్రేడ్ కూడా ఊహించలేదు.