Kantara 2 USA Collections: భారీ అంచనాల నడుమ దసరా కానుకగా విడుదలైన ‘కాంతారా 2′(Kantara : Chapter 1) చిత్రం ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని మొదటి రోజున 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మొదటి నుండి ఉన్న హైప్ కి, జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి, ఇది చాలా తక్కువ ఓపెనింగ్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొదటి రోజు ఈ చిత్రం కనీసం 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు. కన్నడ వెర్షన్ లో ఊహించినట్టుగానే భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాత తెలుగు వెర్షన్ లో కూడా బాగానే వచ్చింది. హిందీ వెర్షన్ లో డీసెంట్ అనిపించుకుంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం పెద్ద దెబ్బ పడింది.
ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రాన్ని 9 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 82 కోట్ల రూపాయలకు అన్నమాట. ఈ స్థాయి బిజినెస్ జరిగిన సినిమాకు ప్రీమియర్ షోస్ నుండి కనీసం 1 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ఆశిస్తారు. కానీ ఈ చిత్రానికి కేవలం హాఫ్ మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే ప్రీమియర్ షోస్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కదా, మొదటి రోజు నుండి మంచి వసూళ్లు వస్తాయని అనుకుంటే, ఇంకా తక్కువ వసూళ్లను నమోదు చేసుకుంది. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజు కేవలం 2 లక్షల డాలర్లు మాత్రమే వచ్చిందట. రెండవ రోజున మూడు లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
అలా కేవలం ప్రీమియర్ షోస్ నుండి 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అనుకున్న ఈ సినిమా, ప్రీమియర్స్ + మొదటి రోజు + రెండవ రోజు కి కలిపి వస్తుంది. పాపం బయ్యర్ కి ఏడవడం ఒక్కటే తక్కువ. వారం క్రితమే ‘ఓజీ’ సినిమాని కొనుగోలు చేసి భారీ లాభాలను అందుకున్నాడు ఈ బయ్యర్. ఇప్పుడు కాంతారా 2 ని భారీ రేట్ కి కొనుగోలు చేసి ఓజీ చిత్రం ద్వారా వచ్చిన లాభాలు మొత్తం ఈ సినిమా తో పోయే అవకాశాలు ఉన్నాయని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. కనీసం వీకెండ్ లో అయితే పాజిటివ్ మౌత్ టాక్ బాగా వ్యాప్తి చెంది, ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో భారీ వసూళ్లు నమోదు అవుతాయేమో అనే ఆశతో ఉన్నారు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.