OG Movie Hindi version Collections: మన టాలీవుడ్ హీరోలకు ప్రస్తుతం పాన్ ఇండియన్ మార్కెట్ అత్యంత కీలకం. స్టార్ హీరోలు తమ ప్రతీ సినిమాని పాన్ ఇండియా వైపే ఫోకస్ పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తున్నారు. రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా ‘ఓజీ'(They Call Him OG) లాంటి పాన్ ఇండియన్ చిత్రాన్ని చేసాడు. అయితే ఈ సినిమాని మేకర్స్ కేవలం తెలుగు వెర్షన్ లో తప్ప, మిగిలిన భాషల్లో చాలా లిమిటెడ్ రిలీజ్ ఇచ్చారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కారణంగా నార్త్ ఇండియా లో నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. ఒకవేళ చేసుంటే పవన్ కళ్యాణ్ కి నార్త్ ఇండియా మార్కెట్ దక్కేది. బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేశారు. అయితే నేషనల్ మల్టీప్లెక్స్ లలో కాకుండా ఈ చిత్రాన్ని కొన్ని ఇండిపెండెంట్ థియేటర్స్ లో విడుదల చేశారు.
అక్కడి ఆడియన్స్ కి ఈ థియేటర్స్ లో చూసే అలవాటు లేదు. అయినప్పటికీ ఈ చిత్రం 8 రోజుల్లో హిందీ వెర్షన్ నుండి 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు కేవలం 50 లక్షల ఓపెనింగ్ తో మొదలైన ఈ సినిమా పది కోట్ల గ్రాస్ వరకు చేరిందంతే, అక్కడి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు అని అర్థం. లిమిటెడ్ రిలీజ్ తోనే పది కోట్ల గ్రాస్ ని రాబట్టిందంటే, కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసి ఉండుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. కచ్చితంగా నార్త్ ఇండియా నుండి ఈ చిత్రం 50 నుండి 75 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి ఉండేది. బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసారంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా వాపోతున్నారు.
ఓజీ సంగతి పక్కన పెడితే, భవిష్యత్తులో తెరకెక్కబోయే ‘ఓజీ సీక్వెల్’ లేదా ‘ఓజీ ప్రీక్వెల్’ ని అయినా బాలీవుడ్ లో భారీ రేంజ్ లో విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఓజీ చిత్రం నార్త్ ఇండియన్ ఆడియన్స్ థియేటర్స్ ద్వారా పెద్దగా రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాక కచ్చితంగా రీచ్ అవుతుంది. సినిమా బాగుంది కాబట్టి అక్కడి ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే బాలీవుడ్ లో ఓజీ సిరీస్ కి మామూలు క్రేజ్ రాదు. కేజీఎఫ్, పుష్ప సిరీస్ తరహా లో ఈ ఓజీ సీక్వెల్ కూడా బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంటుంది.