Amitabh Bachchan role in OG: ఓజీ(They Call Him OG) సినిమా నేడు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి కేవలం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఒక్కడే కారణం కాదు, ఆ సినిమాలో నటించిన నటీనటులకు కూడా ప్రధానమైన క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ చాలా తక్కువసేపు కనిపిస్తాడు. ఆ తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ని నటీనటులే తమ అద్భుతమైన నటనతో నిలబెట్టారు. ఇది కాదు అనలేని నిజం. ముఖ్యంగా ఈ సినిమాలో సత్య దాదా గా నటించిన ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ఎంత బాగా వచ్చిందో మనమంతా చూసాము. హీరో కి గాడ్ ఫాదర్ రోల్ లో ఆయన ఒదిగిపోయాడు. అయితే ఈ క్యారక్టర్ ని ముందుగా ప్రకాష్ రాజ్ తో కాదు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో చేయించాలని అనుకున్నాడట డైరెక్టర్ సుజిత్. అదే విధంగా జిమ్మీ, ఒమీ లకు తండ్రి పాత్ర కోసం సంజయ్ దత్ తో చేయించాలని అనుకున్నాడట.
కానీ పవన్ కళ్యాణే ఒద్దు అన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్,ఫుల్ బిజీ గా ఉంటారు, నాకున్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ ఉండే అవకాశం ఉంది, అప్పుడు వాళ్ళ డేట్స్ సమస్య వస్తుంది, ప్రాజెక్ట్ ముందుకు కదలదు అని చెప్పి ఆపించేసాడట. లేదంతే మనం ఇప్పుడు సత్య దాదా క్యారక్టర్ లో అమితాబ్ బచ్చన్ ని చూసేవాళ్ళం. పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ కి ఎంతటి వీరాభిమాని అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో ఆయన ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆ క్యారక్టర్ ని అమితాబ్ తో చేయించి ఉండుంటే, సినిమాకి ఇంకా ఎక్కువ వేల్యూ ఉండేది. బాలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి మంచి రీచ్ వచ్చేది, బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ని వెండితెర పై చూసే అదృష్టం కోల్పోయాం అంటూ అభిమానులు బాధపడుతున్నారు.
అంతే కాదు విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ క్యారక్టర్ కోసం ముందుగా కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన రక్షిత్ శెట్టి ని సంప్రదించారట. ఎందుకో ఆయన ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. ఒకవేళ చేసుంటే వేరే లెవెల్లో ఉండేది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా లేకుండా ఉండుంటే చాలా ఖరీదైన క్యాస్టింగ్ ని ఓజీ చిత్రం లో మనం చూసేవాళ్ళం. కానీ ఎలాంటి క్యాస్టింగ్ లేకుండా, కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజి తో, యావరేజ్ టాక్ తో తెలుగు వెర్షన్ నుండి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం సాధారణమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.