Kannappa: మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). ఇందులో ఆయన టైటిల్ క్యారక్టర్ ని చేస్తుండగా, రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohanlal) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో విడుదలను వాయిదా వేశారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా లో కన్నప్ప గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 1 లక్ష 35 వేల లైక్స్ వచ్చాయి. లైక్స్ అంటే ఈ సినిమాని థియేటర్స్ లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రేక్షకుల సంఖ్య అన్నమాట. అదే విధంగా ప్రభాస్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab) కి ఒక లక్ష 11 వేల లైక్స్ వచ్చాయి.
Also Read: ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్…
‘ది రాజా సాబ్’ చిత్రం కంటే ‘కన్నప్ప’ కి అత్యధిక లైక్స్ రావడమే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ప్రభాస్ దురాభిమానుల దీనిపై ఒక రేంజ్ లో ట్రోల్స్ వేస్తున్నారు. అయితే విశ్లేషకులు చెప్తున్న సమాచారం ప్రకారం ‘కన్నప్ప’ కి వచ్చిన లైక్స్ మొత్తం ఒక ప్రముఖ ఏజెన్సీ కి సంబంధించిన పైడ్ లైక్స్ అని, రాజా సాబ్ చిత్రానికి ఆర్గానిక్ గా లైక్స్ వచ్చాయని, అందులో ఎలాంటి ఫేక్ లైక్స్ లేవని అంటున్నారు. ఇక త్వరలో విడుదల కాబోతున్న పాన్ ఇండియన్ సినిమాలలో ‘బుక్ మై షో'(Book My Show) యాప్ లో అత్యధిక లైక్స్ ని సొంతం చేసుకున్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటిస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఈ సినిమాకు దాదాపుగా ఒక లక్ష 57 వేల లైక్స్ వచ్చాయి. వచ్చే నెల 9వ తారీఖున ఈ సినిమా విడుదల అవుతుందని మేకర్స్ అధికారిక ప్రకారణ అయితే చేసారు కానీ, షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఈ చిత్రం విడుదల అవుతుందనే నమ్మకం లేదు.
‘హరి హర వీరమల్లు’, ‘కన్నప్ప’ చిత్రాల తర్వాత అత్యధిక లైక్స్ ని సొంతం బుక్ మై షో యాప్ లో సొంతం చేసుకున్న చిత్రం ‘ఓజీ’. దాదాపుగా ఒక లక్ష 17 వేల లైక్స్ ఈ సినిమాకు వచ్చాయి. ఈ మూడు చిత్రాల తర్వాతి స్థానం లో రాజా సాబ్ నిల్చింది. ఈ నాలుగు సినిమాల తర్వాత 95 వేల లైక్స్ తో కేజీఎఫ్ సిరీస్ హీరో ‘టాక్సిక్’ చిత్రం ఐదవ స్థానం లో నిలవగా, 88 వేల లైక్స్ తో సూర్య ‘రెట్రో’ చిత్రం ఆరవ స్థానం లోనూ, 60 వేల లైక్స్ తో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్నా ‘వార్ 2’ చిత్రం 7వ స్థానం లోనూ కొనసాగుతున్నాయి.