Tamannaah Bhatia: పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్స్ క్యాటగిరీలో సూపర్ స్టార్ రేంజ్ ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు తమన్నా భాటియా. సుమారుగా రెండు దశాబ్దాల నుండి ఈమె విశ్రాంతి అనేదే లేకుండా సినీ కెరీర్ ని కొనసాగిస్తూనే ఉంది. ప్రతీ ఏడాది కొత్తగా ఎంత మంది హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి దూసుకొస్తున్నప్పటికీ తమన్నా(Tamannaah Bhatia) స్థానాన్ని రీప్లేస్ చేయలేకపోతున్నారు. పాలరాతి శిల్పం లాంటి అందంతో పాటు, అద్భుతమైన నటన, మెరుపు వేగంతో వేసే డ్యాన్స్ తమన్నా లో ఉన్నటువంటి అదనపు ప్రత్యేకతలు. అందుకే ఆమె ఇప్పటికీ మంచి డిమాండ్ తోనే ఇండియన్ సినిమాలో కొనసాగుతుంది. ఇకపోతే తమన్నా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. తమన్నా లాంటి వాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయా అని ఈ మాటలు విన్న తర్వాతే ఆడియన్స్ కి అర్థమైంది.
Also Read: ‘రాజా సాబ్’ ని దాటేసిన ‘కన్నప్ప’..ఊహించని వింత పరిణామం!
ఆమె మాట్లాడుతూ ‘నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. ఒకపక్క నా చదువు డిస్టర్బ్ కాకుండా, మరోపక్క నా సినిమాల షూటింగ్స్ కి అంతరాయం కలగకుండా ఉండేందుకు నా టీచర్లు ఎంతో సహకరించారు. వాళ్ళ కారణంగానే నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండిటిని బ్యాలన్స్ చేసుకుంటూ రాగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన జీవితం లో మొట్టమొదటిసారి బోరుమని ఏడ్చినా సంఘటన గురించి కూడా ఈ ఇంటర్వ్యూ లో గుర్తు చేసుకుంది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘నా 21వ పుట్టినరోజు నాడు ఒక ప్రముఖ న్యూస్ పేపర్ నాపై ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురితం చేసింది. ఆ కథనం నన్ను పుట్టినరోజు నాడు కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది, కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ కోలుకొని పరుగులు తీసాను’.
‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మధ్యలో ఎన్నో ఇబ్బందులను ఎదురుకోవాల్సి ఉంటుంది. వాటిని విజయవంతంగా ఎదురుకున్నప్పుడే సక్సెస్ లను చూడగలము. నేను సినిమాని ఎప్పుడూ ఒక వృత్తిగా చూడలేదు. సినిమానే నా జీవితం గా భావించాను’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే తమన్నా రీసెంట్ గా ‘ఓదెల 2′(Odela 2 Movie) అనే చిత్రం చేసింది. ఆహా మీడియా యాప్ లో సెన్సేషన్ సృష్టించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ నెల 17 న థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. తమన్నా ఇందులో లేడీ అఘోర గా కనిపించనుంది. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బడ్జెట్ ని రీకవర్ చేసుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.