Kannappa : మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన డ్రీం ప్రాజెక్ట్ గా భావించి నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో, దేశం లో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ అందరినీ ఈ చిత్రంలోకి తీసుకొని నిర్మించాడు. ఇప్పటికే ఒక టీజర్ విడుదలై పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. కాసేపటి క్రితమే రెండవ టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో ప్రభాస్(Rebel Star Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohan lol), మోహన్ బాబు(Manchu Mohan Babu) వంటి వారు కనిపించారు. టీజర్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ప్రేక్షకులు కోరుకున్న వావ్ ఫాక్టర్స్ ఏమి లేకపోవడం గమనార్హం. అక్షయ్ కుమార్,ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ నటించారు కాబట్టి, వాళ్లకి సంబంధించిన షాట్స్ అభిమానులకు కాస్త గూస్ బంప్స్ తెప్పించాయి. అవి తప్ప ఈ టీజర్ లో చెప్పుకోడానికి ఏమి లేవని చెప్పొచ్చు.
మొదటి టీజర్, రెండవ టీజర్, విడుదలైన శివయ్య సాంగ్, ఇవన్నీ గమనిస్తే ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ మంచు విష్ణు అనే అనిపిస్తుంది. ఆయన డైలాగ్ డెలివరీ లో కానీ, ఆహార్యం లో కానీ ఉండాల్సిన ఇంటెన్సిటీ అసలు లేదు. అప్పట్లో ‘కన్నప్ప’ క్యారక్టర్ లో కృష్ణంరాజు ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో ఆ చిత్రం అంతటి సంచలన విజయం సాధించిందంటే అందుకు కారణం కృష్ణంరాజు గారు ఆ పాత్ర లో జీవించడం వల్లే. కానీ కన్నప్ప చిత్రం లో విష్ణు నటనలో అది బాగా మిస్ అయ్యిందని స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ క్యారక్టర్ ఆయన కాకుండా వేరే హీరోతో చేసి ఉండుంటే ఈ చిత్రానికి ఈపాటికి బోలెడంత బిజినెస్ జరిగేదని అంటున్నారు విశ్లేషకులు. కేవలం సూపర్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారనే తప్ప, ఎందుకు ఈ చిత్రాన్ని చూడాలి అనే దానిపై మాత్రం కచ్చితంగా కారణాలను ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ ఇవ్వలేదు.
Also Read : ఆ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోరు అంటూ ‘కన్నప్ప’ మూవీ పై మంచు మనోజ్ సెటైర్స్!
ప్రభాస్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కాబట్టి ఈ చిత్రానికి ఓపెనింగ్స్ విషయం లో మాత్రం ఢోకా లేదు.. కానీ లాంగ్ రన్ ఎంత వరకు నిలబడుతుంది అనేది మంచు విష్ణు నటన, దర్శకత్వం మీదనే ఆధారపడింది. ఈరోజు విడుదలైన ఈ టీజర్ లో చివరి షాట్ లో ప్రభాస్ కనిపించడం హైలైట్ గా మారింది. కానీ ఎందుకో ప్రభాస్ లుక్స్ ఒకప్పుడు ఉన్న రేంజ్ లో ఇప్పుడు లేవు. ఈ సినిమాలో కూడా ఆయన లుక్స్ చాలా తేడాగా ఉన్నాయి. సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానుల నుండి ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. కానీ ఇది చివరి కాపీ కాదు కాబట్టి, సినిమాలో ఆయన లుక్స్ మరింత బాగుందే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమా మంచు విష్ణు కలలను నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి.