Kannappa : గత కొంతకాలం నుండి మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలను మనం మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. వీళ్ళ ఇంట్లో గొడవలు చూసిన తర్వాత, ఇలాంటోళ్ళు ప్రపంచంలో కూడా ఉంటారా అని కొంతమంది నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. కన్న కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లండి అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చే తండ్రి, అదే విధంగా కన్న తండ్రిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కొడుకు, బహుశా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏ కుటుంబంలోనూ ఇలా జరిగి ఉండదేమో. రీసెంట్ గా కూడా మోహన్ బాబు(Manchu Mohan Babu) తన ఆస్తులను అనుభవించడానికి మనోజ్(Manchu Manoj) కి ఎలాంటి హక్కు లేదు, వెంటనే ఖాళీ చేయాలి అంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా మనోజ్ జగన్నాద్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.
ఈ ఈవెంట్ లో ఆయన కన్నప్ప(Kannappa) ని ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘సినిమాలో విషయం ఉంటే ఎవ్వరూ ఆపలేరు. విషయం లేకుండా ఎంత బడ్జెట్ పెట్టినా బూడిదలో పోసిన పన్నీరే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేరుగా సినిమా పేరు ప్రస్తావించకపోయిన, పరోక్షంగా ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడో అర్థమైపోయింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదు నేను. నన్ను తొక్కడం సాధ్యమైన విషయం కాదు. నన్ను పైకి లేపే సత్తా కూడా ఎవరికీ లేదు. నన్ను తొక్కాలన్నా, పైకి లేపాలన్నా అది ఆడియన్స్ కి మాత్రమే సాధ్యం, నా నుండి వాళ్ళను వేరు చేయలేరు, నాకు న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ‘కన్నప్ప’ చిత్రం పై మంచు మనోజ్ వేసిన పరోక్ష సెటైర్లు కాసేపు పక్కన పెడితే, రీసెంట్ గా ఆ చిత్రం నుండి విడుదలైన పాటకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘కన్నప్ప’ నుండి ఈ రేంజ్ సాంగ్ విడుదల అవుతుందని ఊహించలేదని, కొన్నేళ్ల పాటు ఈ పాట మారుమోగిపోతుందని అంటున్నారు. యూట్యూబ్ లో ఈ పాటకు కేవలం మూడు రోజుల్లోనే 67 లక్షల వ్యూస్ వచ్చాయి. మంచు విష్ణు కి ఈ రేంజ్ వ్యూస్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. వీళ్లంతా మోహన్ బాబు మీద ఉన్న అభిమానంతో ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించారట. చూడాలి మరి వాళ్లకు సంబంధించిన సన్నివేశాలు ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్తుందా లేదా అనేది.