Today 27 June Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణ ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు వారి ఆరోగ్యం ఈరోజు మెరుగుపడుతుంది. వ్యాపారాలు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. విదేశాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి పై చర్చ జరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటే మౌనంగా ఉండడమే మంచిది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం పెరుగుతున్న ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తపెట్టబడులు పెడతారు. ఈ సమయంలో పెద్దల సలహా అవసరం.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : మీ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ పెద్దల తో కలిసి మెలిసి ఉంటారు. బడ్జెట్కు అనుగుణంగా ఖర్చులు చేస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు. విదేశాల నుంచి సమాచారం అందుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేసినా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే వీరికి కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. అయినా అవి ఇవి పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. అనుకోకుండా ప్రయాణం ఉంటుంది. ఇవి లాభాలను తీసుకొస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనుకోకుండా అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరు పదోన్నతులు పొందే అవకాశం ఉంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులను పెట్టేముందు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబంలో చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ప్రయాణంలో ఉత్సాహం ఉంటుంది. పూర్వికులు ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. దూరపు బంధువులు ఇంటికి వస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు కొన్ని అడ్డంకులు ఏర్పడినప్పటికీ అవసరమైన లాభాలు ఉంటాయి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు దానిని పూర్తిచేసే వరకు విడిచి పెట్టొద్దు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈరోజు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు లాభాలను పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం ఏర్పడుతుంది. కొన్ని పనులు నెమ్మదిగా సాగిన విజయవంతంగా పూర్తి అవుతాయి. విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి పెడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రాజెక్టులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరిస్తారు. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణ ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడానికి కష్టపడతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తల్లిదండ్రుల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. పూర్వికులు ఆస్తి విషయంలో చర్చలు జరుగుతాయి. వ్యాపారుల ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి. ఖర్చులు పెరిగిన కావాల్సిన ఆదాయం అందుతుంది. విద్యార్థులు కెరీర్ కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఒత్తిడి పెరుగుతుంది. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. రైలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటారు. వైద్య సలహా మేరకు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది.