Kannappa Collection Day 3: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ గా భావించి, సోషల్ మీడియా లో నెగటివిటీ ని ఛేదించి, మూడేళ్ళ పాటు ఎంతో కష్టపడి, ఒక పక్క నిర్మాతగా,మరో పక్క హీరో గా నటించిన చిత్రం ‘కన్నప్ప'(Kannappa) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు సినిమా అంటేనే మీమర్స్ కి, ట్రోలర్స్ కి ఫెస్టివల్ డేస్ అనొచ్చు. కానీ ఈ సినిమాలో తనని ట్రోల్ చేయడానికి ఆయన ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అంతటి అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు మంచు విష్ణు నటన తన కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్ కి, వస్తున్న వసూళ్లకు అసలు సంబంధమే లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
వస్తున్న ఈ కాస్త వసూళ్లు కూడా ప్రభాస్(Rebel Star Prabhas) ని చూసి వస్తున్నవే , ఒకవేళ ఆయన లేకపోతే ఈ సినిమా పరిస్థితి ఏంటో అని బయ్యర్స్ కామెంట్స్ చేస్తున్నారు. తొలి మూడు రోజుల్లో ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి పరిశీలిద్దాం. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మంచు విష్ణు రేంజ్ కి ఇది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ, సినిమాకు పెట్టిన బడ్జెట్ దృష్ట్యా చూస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కి ఏ మాత్రం సరిపోదు. ఇక రెండవ రోజు అయితే ఏకంగా కేవలం 3 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. సాధారణంగా ఇలాంటి సినిమాలకు మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి.
రీసెంట్ గా విడుదలైన ‘కుబేర’ చిత్రానికి అలాగే జరిగింది. కానీ ఇక్కడ దాదాపుగా 50 శాతం డ్రాప్స్ రావడం మంచి ట్రెండ్ కి సూచికం కాదు. ఇక మూడవ రోజున ఈ చిత్రానికి కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇలా రోజురోజుకి తగ్గుతూ వెళ్తున్నాయి వసూళ్లు. మొత్తం మీద మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 13 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 19 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది. తెలుగు వెర్షన్ లో అంత వచ్చే అవకాశాలే కనిపించడం లేదు. హిందీ వెర్షన్ మీదనే మంచు విష్ణు ఆశలు పెట్టుకున్నాడు. అక్కడ మొదటి రోజుకంటే రెండవ రోజు, మూడవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి, కాబట్టి కాస్త లాంగ్ రన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.