Hari Hara Veeramallu Poster: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని జులై 3 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ స్వయంగా మొన్న నిర్మాతలు అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేసారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పట్టుకున్న తుపాకీ ని చూసి, ఇదేంటి ఇంత పొడవు ఉంది? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే వెక్కిరించారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నది తుపాకీ కాదు అనే విషయాన్ని తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. తుపాకీ కాకపోతే ఇదేంటి?, అసలు దీని చరిత్ర ఏంటి అని అభిమానులు ఆరాలు తీశారు. అలా ఆరాలు తీసిన తర్వాత తెలిసింది ఏమిటంటే ఇది తుపాకీ కాదు,’మ్యాచ్ లాక్’ అని తెలిసింది. మొఘల్ సామ్రాజ్యం లో ఈ ఆయుధాలను ఉపయోగించేవారట.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
డైరెక్టర్ క్రిష్ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి అప్పట్లో గొప్ప పరిశోధన చేసి, ఆరోజుల్లో ఎలాంటి ఆయుధాలు, వస్త్రాలు వాడే వారో వాటిని మక్కీకి మక్కి దింపారట. సినిమాలో ఇలాంటి వెరైటీ గన్స్ మరో మూడు ఉంటాయని టాక్. అయితే అక్బర్ పాలనలో ఈ మ్యాచ్ లాక్స్ బ్యారెల్ సైజ్ తగ్గించారట. అలా ఈ మ్యాచ్ లాక్ అప్డేట్ అవుతూ వచ్చి ఇప్పుడు గన్ గా మారింది. దీనిని బట్టీ చూస్తుంటే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా కోసం ఏ రేంజ్ హోమ్ వర్క్ చేసాడో అర్థం అవుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టేసాడు. తన డ్రీం ప్రాజెక్ట్ అన్నట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ దురదృష్టం కొద్దీ పరిస్థితుల ప్రభావం కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి బలవంతంగానే తప్పుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి 70 శాతం కి పైగా క్రిష్ నే దర్శకత్వం వహించాడు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కి ఈ ట్రైలర్ వేరే లెవెల్ లో నచ్చిందట. దీనిని చూసిన వెంటనే నోటి నుండి మాట రాలేదని అన్నాడట. సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో ఈ ట్రైలర్ లో చూపించారట. ఒక విధంగా చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ బాహుబలి అని అంటున్నారు. ట్రైలర్ లోని రెండు మూడు ఇంటెన్స్ షాట్స్ అభిమానులను మెంటలెక్కిపోయేలా చేస్తుందట. ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే థియేటర్స్ ని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఖరారు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా థియేటర్స్ ఖరారు కావాల్సి ఉంది. ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ని కూడా అప్పట్లో ఇదే విధంగా థియేటర్స్ లో విడుదల చేశారు. సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం తో సినిమా మీద ఉన్న హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ అదే మ్యాజిక్ ని ఈ చిత్రం ట్రైలర్ కి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్.