Kannappa First Look: విలక్షణ నటుడు మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు స్టార్ కాలేకపోయాడు. కెరీర్ బిగినింగ్ లో ఒకటి రెండు హిట్స్ ఇచ్చాడు. తర్వాత గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. మంచు విష్ణును హీరోగా జనాలు గుర్తించడం లేదు. ఆయన సినిమాను చూసేందుకు థియేటర్ కి ప్రేక్షకులు రావడం లేదు. ఆయన గత చిత్రం జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా దారుణ వసూళ్లు అందుకుంది. జిన్నా మూవీ కనీసం కోటి రూపాయల షేర్ అందుకోలేదు. ఆ మూవీలో విలన్ రోల్ చేసిన సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ కంటే కూడా వసూళ్లు తక్కువంటూ సెటైర్స్ వినిపించాయి.
అలాంటి మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ చేయడం పెద్ద సాహసమే. కన్నప్ప మూవీతో మంచు విష్ణు సంచలనానికి తెరలేపాడు. కన్నప్ప పీరియాడిక్ డివోషనల్ డ్రామా. శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ. చాలా ఏళ్ల క్రితం కృష్ణంరాజు-బాపు కాంబోలో భక్త కన్నప్ప టైటిల్ తో ఈ సబ్జెక్టు తెరకెక్కించారు. ఈ జెనరేషన్ ఆడియన్స్ కోసం మంచు విష్ణు కన్నప్ప టైటిల్ తో ఆ గాథ తెరకెక్కిస్తున్నారు.
కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ అక్కడే జరిపారు. ఇటీవల రెండో షెడ్యూల్ కూడా పట్టాలెక్కింది. కన్నప్ప బడ్జెట్ వంద కోట్లకు పైమాటే. ప్రస్తుతం మంచు విష్ణు మార్కెట్ రీత్యా ఆ స్థాయి వసూళ్లు జరగని పని. అందుకే స్టార్ క్యాస్ట్ ని భాగం చేసి వివిధ భాషల్లో సినిమాకు ప్ ప్రచారం కల్పించాలని అనుకుంటున్నారు. ఏకంగా ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. అలాగే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి టాప్ హీరోలు నటిస్తున్నారు.
కాగా మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బోయవాడి గెటప్ లో మంచు విష్ణు ఆసక్తి రేపుతున్నాడు. విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టి సీరియస్ పోజ్ లో ఉన్న మంచు విష్ణు బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేశాడు. కన్నప్ప ఫస్ట్ లుక్ చూసిన సినిమా జనాలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈసారి మంచు విష్ణు గట్టిగా కొట్టబోతున్నాడని అంటున్నారు. మరి కన్నప్పతో మంచు విష్ణు హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు.
Honoured and privileged to portray the greatest devotee of Lord Shiva, ‘Kannappa’. Today on MahaShivaRatriॐ, here is your ‘#‘.@themohanbabu @Mohanlal #Prabhas @realsarathkumar @PDdancing @mukeshvachan #preitymukhundhan #Brahmanandam @GkParuchuri @prasaadnaidu5… pic.twitter.com/v8dF7ufvaI
— Vishnu Manchu (@iVishnuManchu) March 8, 2024