Mahashivratri: శివరాత్రికి ఉపవాసాలు చాలా మంది ఉంటారు. ఈ రోజును అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దేశ ప్రజలందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. కొన్ని పండగలను కొన్ని ప్రాంతాల వారు మాత్రమే జరుపుకుంటారు. కానీ ఈ పండగను మాత్రం దేశ ప్రజలందరూ కలిసి నిర్వహించుకుంటారు. మరి ఈ రోజు జాగరణ, ఉపవాసం ముఖ్యం. మీరు కూడా ఉన్నారా? మరి ఈ రోజు ఉపవాసం వదిలేటప్పుడు ఏం తినాలి? నేరుగా అన్నం తినవచ్చా లేదా అనే వివరాలు చూసేద్దాం.
శంకరుడు అంటే అందరికీ శుభాలను జరిగేలా చూసేవాడు. ఈ విశ్వాన్ని నడిపించే ఆ పరమశివుడు శివలింగంగా ఆవిర్భవించాడు ఈ రోజు. పార్వాతిని వివాహం చేసుకున్న రోజు కూడా ఇదే రోజు అవడం విశేషం. క్షీరసాగర మథనంలో పుట్టిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తీసుకొని, తన కంఠంలో దాచుకొని శివుడు నీలకంఠుడిగా మారిన రోజు కూడా ఇదే రోజు. శివరాత్రి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనం కలిగేలా అభిషేకాలు చేసి ఉపవాసం ఉంటారు భక్తులు.
ఆధ్యాత్మికంగా కాకుండా ఆరోగ్యపరంగా ఉపవాస నియమం కూడా మంచిదే అంటారు కొందరు. మాఘమాసం వరకు మందగించి ఉండే జీర్ణవ్యవస్థ, వేసవి రాకతో ఎక్కువ అవుతుందట శీతాకాలం, వేసవి సంధి కాలంలో వచ్చే శివరాత్రి నాడు ఉపవాసం చేయడంతో శరీరం వాతావరణంలో జరిగే మార్పులకు తగినట్లుగా సిద్ధమవుతుందని చెబుతారు ఆరోగ్య నిపుణులు. ఏది ఏమైనా ఉపవాసం ఉండి వెంటనే ఆహారం తీసుకోకూడదట. అంటే శివరాత్రికి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు. మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమించుకుంటారు.
మహాశివరాత్రి ఉపవాసం విరమించిన వెంటనే అన్నం తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందట. ముందుగా ఏదైనా జ్యూస్ తీసుకోవాలట. ఆ తర్వాత కాసేపటికి పండ్లు తిని, తేలికైన ఆహారం తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా కేలరీలు కలిగిన ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. తెలుసుకున్నారు కదా.. మరి ఆరోగ్యం కోసం దీన్ని పాటించండి..