Aaru: సూర్య ‘ఆరు’ సినిమాను రీమేక్ చేయాలనుకున్నా తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సూర్య గజిని సినిమా తెలుగు లో సూపర్ హిట్ అవడం తో ఆ సినిమా ప్రొడ్యూసర్స్ రైట్స్ అమ్మకుండా డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో పర్వాలేదు అనిపించినప్పటికీ సూపర్ హిట్ గా మాత్రం మారలేకపోయింది.

Written By: Gopi, Updated On : March 9, 2024 9:19 am

Aaru

Follow us on

Aaru: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో సూర్య ఒకరు. ఈయన చేసిన సినిమాలని చూడడానికి తమిళ్ ప్రేక్షకులు విపరీతమైన ఉత్సాహాన్ని చూపిస్తారు. ఇక అందులో భాగంగానే ఆయనకి కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతూ ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే సూర్య గజిని సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడంతో ఆయన చేసిన అన్ని సినిమాలను ఇక్కడ డబ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల ఆయనకు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఏర్పడటం కాకుండా తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో పాటు పోటీపడుతూ ఆయన చేసిన సినిమాలు భారీ కలెక్షన్లను రాబడుతూ ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన ఆరు సినిమాను మొదట తమిళంలో రిలీజ్ చేశారు. అక్కడ సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగులో రీమేక్ చేయాలని చూశారు. ఇక ఆ ప్రాసెస్ లోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నారు.

కానీ అప్పటికే సూర్య గజిని సినిమా తెలుగు లో సూపర్ హిట్ అవడం తో ఆ సినిమా ప్రొడ్యూసర్స్ రైట్స్ అమ్మకుండా డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో పర్వాలేదు అనిపించినప్పటికీ సూపర్ హిట్ గా మాత్రం మారలేకపోయింది. ఒకవేళ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనక హీరోగా చేసినట్లైతే కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేదని చాలా మంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.

నిజానికి ఈ సినిమాలో కొంచెం మాస్ ఎలివేషన్స్ ని యాడ్ చేసి తెలుగు లో వదిలితే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది అని మరి కొంతమంది సినీ విమర్శకులు సైతం తెలియజేస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం ఈ సినిమా తెలుగులో డబ్ చేయడమే మంచిది అయిందని, సూర్యనే ఈ సినిమాలో చాలా మంచి యాక్టింగ్ ని కనబరిచి ప్రేక్షకులను మెప్పించాడు అంటూ చెప్తూ ఉంటారు.