https://oktelugu.com/

‘డెడ్లీ కరోనా’పై పాన్ ఇండియా మూవీ

చైనాలో సోకిన కరోనా ప్రస్తుం ప్రపంచాన్ని వణికిస్తుంది. 120కిపైగా దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 4వేలమందికి పైగా కరోనా బాధితులు మృత్యువాతపడగా, లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం భారత్‌లో 75కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా(కోవిడ్-19)పై కన్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్‌ సినిమా తీసేందుకు యత్నిస్తున్నాడు. ఈ మూవీకి ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్ రిజిస్టర్‌ చేయించారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 13, 2020 4:50 pm
    Follow us on

    చైనాలో సోకిన కరోనా ప్రస్తుం ప్రపంచాన్ని వణికిస్తుంది. 120కిపైగా దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 4వేలమందికి పైగా కరోనా బాధితులు మృత్యువాతపడగా, లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం భారత్‌లో 75కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

    ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా(కోవిడ్-19)పై కన్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్‌ సినిమా తీసేందుకు యత్నిస్తున్నాడు. ఈ మూవీకి ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్ రిజిస్టర్‌ చేయించారు. ఈ మూవీలో కరోనా పుట్టపురోత్తరాలతో సహా ఇది ఎలా వ్యాపిస్తుంది.. ఇతర దేశాలకు ఎలా పాకింది.. ఎలా నివారించాలి.. అనే అంశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని పాన్‌ ఇండియా లెవల్లో తీసేందుకు చిత్రదర్శకుడు సన్నహాలు చేస్తున్నాడు.

    భారత్ లో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీలోని నెల్లూరు, కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. కరోనా లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం పేర్కొంది.